ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Village Volunteer Rape Tenth Class Student: ఆధార్‌ కార్డులు కావాలని వచ్చి.. బాలికపై వాలంటీరు అత్యాచారం

Village Volunteer Rape Tenth Class Student: రాష్ట్రంలో గ్రామ వాలంటీర్ల వ్యవస్థపై పెద్ద దుమారం ఎప్పటి నుంచో రేగుతోంది. వారు అరాచకాలు, అకృత్యాలకు పాల్పడుతూ.. ప్రభుత్వం అప్పగించిన బాధ్యతలు నిర్వహిస్తున్నామనే ముసుగులో మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. ఏలూరు జిల్లాలో ఓ వాలంటీర్ ఆధార్‌ కార్డులు కావాలని వచ్చి పదో తరగతి బాలికను బెదిరించి పలుమార్లు అత్యాచారం చేశాడు. ఈ వ్యవహారంపై పోలీసులు వాలంటీర్​కే వత్తాసు పలికే విధంగా వ్యవహరిస్తున్నారని బాధిత బంధువులు ఆరోపిస్తున్నారు.

Village Volunteer Rape Tenth Class Student
Village Volunteer Rape Tenth Class Student

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 18, 2023, 10:41 AM IST

Village Volunteer Rape Tenth Class Student :గ్రామ వాలంటీర్ తమ బిడ్డ జీవితాన్ని పాడు చేశాడని, న్యాయం చేయాలని బాలిక తల్లిదండ్రులు ప్రాధేయపడినా పోలీసులు కనికరించలేదు. పరారీలో ఉన్న నిందితుడిని బాధిత బాలిక తల్లిదండ్రులే పట్టుకురావాలంటూ వారికి సలహా ఇచ్చారు పోలీసులు.

నిందితుడికి వైఎస్సార్సీపీ నేతల అండ ఉండటంతోనే పోలీసులు పట్టించుకోవట్లేదని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ సంఘటన ఏలూరు జిల్లా దెందులూరు మండలంలో చోటు చేసుకుంది. పదో తరగతి చదువుతున్న బాలికపై వాలంటీరు అత్యాచారం చేశాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధిత బాలిక బంధువులు తెలిపిన వివరాలిల ప్రకారం..

Volunteer Attacked on Boy వాలంటీర్​ ఘాతుకం.. సిగరెట్లు తీసుకురాలేదని బాలుడ్ని డాబాపై నుంచి తోశాడు!

గ్రామ వాలంటీరు నీలాపు శివకుమార్‌ పదో తరగతి చదువుతున్న బాలిక వెంటపడి వేధించేవాడు. రెండు నెలల క్రితం బాలిక ఇంట్లోకి ఎవరూ లేనప్పుడు తల్లిదండ్రుల ఆధార్‌ కార్డులు కావాలని వెళ్లి.. ఆమెపై అత్యాచారం చేశాడు. తల్లిదండ్రులకు చెబితే చంపేస్తానంటూ తరువాత పలు మార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు ఆ వాలంటీరు. పాఠశాలకు సెలవులు రావడంతో బాలిక తన పెద్దమ్మ ఇంటికి వెళ్లారు. అక్కడ ఆమె వైద్య పరీక్షలు చేయించగా ఆమె గర్భవతి అని తేలింది.

Volunteer Made Pregnant to Student :ఈ విషయం బాలిక తల్లిదండ్రులకు తెలిసి వారు వాలంటీరును నిలదీశారు. దీంతో అతను 10 వేల రూపాయలు ఇస్తానని.. కడుపు తీయించుకోవాలని చెప్పాడు. దీంలో ఇరు కుటుంబాల మధ్య వివాదం జరిగింది. పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టడంతో పెళ్లికి ఒప్పుకొన్నాడు. ఏర్పాట్లు చేసుకున్నాక పెళ్లికి ముందు రోజు వాలంటీర్ పారిపోయాడు.

Volunteers in AP: వాలంటీర్లలో అసాంఘిక రత్నాలు.. వారి నైజం ఇదే..!

ఫిర్యాదు తీసుకోని దిశ స్టేషన్‌ :బాలిక తల్లిదండ్రులు ఏలూరు దిశ పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. అక్కడ అధికారులు లేరంటూ ఫిర్యాదు తీసుకోలేదు. దెందులూరు పోలీస్ స్టేషన్‌కు వెళ్లినా.. కేసు నమోదుకు తాత్సారం చేశారు. చాలా కాలం పోలీసులు పట్టించుకోకపోవటంతో బాధితులు స్పందన, జగనన్నకు చెబుదాం (Jaganannaku Chebudham), 112కు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేశారు. దీంతో ఎట్టకేలకు అక్టోబరు 5న కేసు నమోదు చేశారు. దర్యాప్తులో కాలయాపనపై పోలీసులను బాధిత బాలిక బంధువులు అడగగా.. తమరే నిందితుడిని వెతికి పట్టుకొస్తే తాము చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్పడంతో వారు నిర్ఘాంతపోయారు.

వాలంటీరుకు స్థానిక వైసీపీ నాయకుడి అండ ఉండటంతో పోలీసులు చర్యలు తీసుకోవటం లేదని, కేసు నమోదుకు కూడా తీవ్ర జాప్యం చేశారని బాధిత బాలిక బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై ఏలూరు ఎస్పీ మేరీ ప్రశాంతిని వివరణ కోరగా "దిశ పోలీసు స్టేషన్​లో అధికారులు లేని విషయం వాస్తవమే. బాలికపై గ్రామ వాలంటీరు అత్యాచారం చేసిన విషయం మా దృష్టికి రాలేదు. సంబంధిత అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటాం" అని చెప్పారు.

Public Data Collection: గాలిలో దీపంలా ప్రజల డేటా.. ప్రమాదంలో వ్యక్తిగత గోప్యత

ABOUT THE AUTHOR

...view details