ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఏలూరు జిల్లాలో విషాదం.. గోడ కూలి ఇద్దరు మృతి - AP Latest

Two Died in Wall Collapsed Incident: ఏలూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పాత ఇంటిని పడగొడుతుండగా.. ప్రమాదవశాత్తూ గోడకూలి ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇద్దరు మృతి చెందారు.

Eluru District
ఏలూరు జిల్లా

By

Published : Nov 9, 2022, 9:51 PM IST

Two Persons Died: ఏలూరు జిల్లాలో గోడ కూలి ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. కైకలూరు మండలం సీతనపల్లి గ్రామంలో పాత ఇంటిని పడగొడుతుండగా ప్రమాదవశాత్తూ గొడ కూలి ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. క్షతగాత్రులను కైకలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. తీవ్రంగా గాయపడిన కట్టా జగన్నాథం, కట్ట కోటేశ్వరమ్మలను మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం.. భీమవరం ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఇద్దరు మృతి చెందారు. ఒకే కుటుంబంలో ఇద్దరు మృతి చెందడంతో ఆ ఇంట్లో, గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

ABOUT THE AUTHOR

...view details