కోళ్ల దొంగ అనుకుని.. కొట్టి చంపారు! - కోళ్లను దొంగతనానికే వచ్చాడంటూ కొట్టి చంపారు
09:03 September 18
అవినాష్‌ను చెట్టుకు కట్టేసి కర్రలతో కొట్టిన కోళ్లదొడ్డి యజమాని
ఏలూరు జిల్లా నూజివీడు ఎం.ఆర్.అప్పారావు కాలనీలో దారుణం చోటు చేసుకుంది. మామిడితోటలోని కోళ్లదొడ్డిలో కోళ్ల చోరీకి వచ్చాడన్న నెపంతో..అవినాష్ అనే వ్యక్తిని కోళ్ల దొడ్డి యజమాని కొట్టి చంపాడు. అవినాష్‌ను చెట్టుకు కట్టేసి కర్రలతో కొట్టడంతో, అవినాష్ అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. స్థానికులు అతడ్ని వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండాపోయీంది. నూజివీడు ఆస్పత్రికి తరలించేలోపే అవినాష్ మృతిచెందినట్లు వైద్యుల ప్రకటించారు. ఈ ఘటనపై స్థానికులు పెదవి విరుస్తున్నారు. కోళ్ల దొంగతనం చేస్తే మాత్రం చచ్చేలా కొడతారా..? అంటూ వాపోయారు.
ఇవీ చదవండి: