'ఎయిర్‌పోర్ట్ మెట్రో' వస్తే ఇలా ఉంటుంది.. ఓసారి ఈ వీడియో చూడండి..! - Airport Express Metro latest news
Airport Express Metro Video : హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రో రైలుకు సంబంధించి ప్రభుత్వం పలు వీడియోలు విడుదల చేసింది. ఎయిర్పోర్టుకు మెట్రో సేవలు అందించడం ద్వారా వచ్చే ప్రయోజనాలను అందులో వివరించింది. ప్రస్తుతం ఉన్న రాయదుర్గం మెట్రో స్టేషన్ నుంచి సుమారు 900 మీటర్ల మేరకు.. స్టేషన్‌ను పొడిగించి అక్కడ ఎయిర్‌పోర్టు మెట్రోస్టేషన్ ఏర్పాటు చేయనున్నారు. రాయదుర్గం నుంచి ఎయిర్‌పోర్టు వరకు మొత్తం 31 కారిడార్లు నిర్మిస్తున్నారు. ఎయిర్‌పోర్టు మెట్రో గరిష్ఠంగా 120 కి.మీ. వేగంతో వెళ్తూ 31 కి.మీ. దూరాన్ని 26 నిమిషాల్లో చేరుకునేలా ఏర్పాటు చేస్తున్నారు. ఈ మెట్రో నిర్మాణానికి ఈ నెల 9న ముఖ్యమంత్రి కేసీఆర్ భూమిపూజ చేసిన విషయం తెలిసిందే.
Airport Express Metro Video