Bull Race : ఏలూరు జిల్లా కైకలూరులోని గోపవరం గ్రామంలో రాష్ట్ర స్థాయి ఎడ్ల పందేలు సందడిగా సాగుతున్నాయి. దీపక్ నెక్స్‌జెన్ వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి సుమారు 34 ఎడ్ల జతలు ఈ పోటీల్లో పాల్గొన్నాయి. పందేలను వీక్షించేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత కామినేని శ్రీనివాస్ సంప్రదాయ వస్త్రధారణలో ఎడ్లబండిపై ఎక్కి సందడి చేశారు. ఎడ్ల పందేలతో సంక్రాంతి పండుగ ముందే వచ్చినట్లుందని గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేశారు. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు తెలియజేయాలనే లక్ష్యంతోనే పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
కైకలూరులో సందడిగా రాష్ట్ర స్థాయి ఎడ్ల పందేలు.. హాజరైన మాజీ మంత్రి కామినేని - ఏలూరు జిల్లా వార్తలు
Bulls Race : ఏలూరు జిల్లాలో ఎడ్ల పందేలు ఉత్సాహంగా సాగుతున్నాయి. వివిద జిల్లాల నుంచి ఎడ్ల జతలతో ఔత్సాహికులు నూతనోత్సహంతో పాల్గొంటున్నారు. ఈ పోటీలను చూడటానికి చుట్టుపక్కల నుంచి గ్రామస్థులు తరలివస్తున్నారు. దీంతో పందేలు నిర్వహిస్తున్న ప్రాంతంలో పండగ వాతావరణం నెలకొంది.

ఎడ్ల పందేలు
ఏలూరులో సందడిగా సాగుతున్న రాష్ట్ర స్థాయి ఎడ్ల పందేలు
Last Updated : Jan 10, 2023, 3:03 PM IST