ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మట్టిని తవ్వారు.. మహాశివలింగం బయటపడింది - పోలవరం నిర్మాణ పనుల వార్తలు

Polavaram: పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో శివలింగం బయటపడింది. యంత్రాలతో మట్టి తవ్వుతున్న తరుణంలో కార్మికులు శివలింగాన్ని గుర్తించారు. గోదావరి తీర ప్రాంతంలోని పురాతన శివాలయాలు వరదల వల్ల కనుమరుగయ్యాయని.. ఇప్పుడు వాటికి సంబంధించిన శివలింగమే బయటపడి ఉంటుందని.. స్థానికులు భావిస్తున్నారు.

శివలింగం
శివలింగం

By

Published : May 18, 2022, 9:33 PM IST

పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో.. బయటపడిన శివలింగం

shivalingam found at Polavaram: పోలవరం ప్రాజెక్టు.. నిర్మాణ పనుల్లో శివలింగం బయటపడింది. పోలవరం అప్రోచ్ ఛానల్ పనుల్లో భాగంగా.. సింగన్నపల్లి శివారులో కొంతకాలంగా మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి. యంత్రాలతో మట్టి తవ్వుతున్న తరుణంలో కార్మికులు శివలింగాన్ని గుర్తించి బయటకు తెచ్చారు. స్థానికులు వెళ్లి.. మట్టితో ఉన్న శివలింగాన్ని శుభ్రం చేశారు. అయితే తవ్వకాల సమయంలో శివలింగం బీటలు వారింది. గోదావరి తీర ప్రాంతంలోని పురాతన శివాలయాలు వరదల వల్ల కనుమరుగయ్యాయని, ఇప్పుడు వాటికి సంబంధించిన శివలింగమే బయటపడి ఉంటుందని.. స్థానికులు భావిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details