ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పండుగొచ్చింది.. పాఠశాలల్లో సంక్రాంతి కోలాహలం - makara sankranti

Sankranti Celebrations: రాష్ట్రంలో పలు చోట్ల సంక్రాంతి సంబరాలు కన్నులపండుగగా నిర్వహించారు. ఏలూరు, కోనసీమ, పశ్చిమగోదావరి, కర్నూలు జిల్లాల్లోని పలు ప్రైవేటు పాఠశాలల్లోని విద్యార్థులు సాంప్రదాయ వేషధారణతో పలు ప్రదర్శనలు చేశారు. బొమ్మల కొలువులు, వంటకాల ప్రదర్శనల్లో చిన్నారులు పాల్గొన్నారు.

Sankranti celebrations
సంక్రాంతి

By

Published : Jan 11, 2023, 8:26 PM IST

పలు ప్రైవేటు పాఠశాల్లో సంక్రాంతి సంబరాల నిర్వాహణ

Sankranti Celebrations in AP: రాష్ట్రంలో పలుచోట్ల సంక్రాంతి సంబరాలు కన్నులపండుగగా నిర్వహించారు. కృష్ణాజిల్లా మచిలీపట్నంలో.. పోలీసులు కుటుంబ సభ్యులతో కలిసి సందడి చేశారు. ఏలూరు, కోనసీమ, పశ్చిమగోదావరి జిల్లాల్లోని పలు ప్రైవేటు పాఠశాలల్లోని విద్యార్థులు సాంప్రదాయ వేషధారణతో పలు ప్రదర్శనలు చేశారు. బొమ్మల కొలువులు, వంటకాల ప్రదర్శనల్లో చిన్నారులు పాల్గొన్నారు. సాంప్రదాయ దుస్తులు ధరించి విద్యార్థిని విద్యార్థులు సంక్రాంతి సంబరాలలో నృత్యాలు చేస్తూ అలరించారు. భోగి మంటలు వేసి గొబ్బెమ్మల పాటలు పాడుతూ ముందస్తు సంక్రాంతికి స్వాగతం పలికారు.

కృష్ణాజిల్లామచిలీపట్నంలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహచారు. నిత్యం వృత్తిపరమైన ఒత్తిడి తో బిజీగా ఉండే పోలీసులు కుటుంబ సభ్యులతో కలిసి కాసేపు ఆహ్లాదంగా కనిపించారు. ఇక ఖాకీలు కళాకారులుగా మారి చేసిన డ్యాన్స్​లు అందరినీ ఆకట్టుకున్నాయి. జిల్లా ఎస్పీ నుంచి పలువురు డీఎస్పీలు, సీఐ, యస్.ఐ స్థాయి వరకు అందరూ ఈ సంక్రాంతి సంబరాల్లో సందడి చేశారు.

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మురుమళ్ళలోని శ్రీ సాయి పబ్లిక్ స్కూల్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి.. నిత్యం పుస్తకాలతో కుస్తీపడుతూ.. పరీక్షలతో సతమతమవుతూ ఉండే విద్యార్థినులు సంప్రదాయ దుస్తులు.. లంగా ఓణీలు ధరించి పాఠశాల ప్రాంగణంలో సంక్రాంతి ముగ్గులు వేశారు.. పల్లెల్లో నిర్వహించే సంప్రదాయ కోడిపందాలు.. ఎడ్లబండ్లపై ఊరేగింపులు.. చిన్నారులు గాలిపటాలు ఎగరవేస్తూ ఆనందంగా గడిపారు.. భోగి మంటల చుట్టూ నృత్యాలు చేస్తూ సందడి చేశారు.. విచిత్ర వేషధారణలతో చిన్నారులు ఆకట్టుకున్నారు.

ఏలూరు జిల్లాలోని పలు ప్రైవేట్ పాఠశాలల్లో సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించారు. నగరంలో ఎల్బీసీ కాన్వెంట్లో ఏర్పాటు చేసిన సంబరాల కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ చైర్మన్ పిల్లంగోళ్ల శ్రీలక్ష్మి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫుడ్ ఫెస్టివల్స్​ను పరిశీలించారు చిన్నారులు వివిధ రకాల వంటలు తయారు చేయించి తీసుకొచ్చిన వాటిని గురించి చూసి వారిని అభినందించారు. భావితరాల పిల్లలకు పండుగలు నేపథ్యం సాంప్రదాయాలు తెలియజేయడానికి ఇలాంటి కార్యక్రమం చేయడం అభినందనీయమన్నారు.

పశ్చిమగోదావరి జిల్లా తణుకులో ముందస్తు సంక్రాంతి సంబరాలు కన్నుల పండుగలా జరిగాయి. రాష్ట్ర చేనేత కార్పొరేషన్ మాజీ చైర్మన్ వావిలాల సరళాదేవి ఆధ్వర్యంలో సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేలా ముగ్గులు, గొబ్బిళ్ళు, గంగిరెద్దులు పిండి వంటలు హరిదాసులు యువతీ యువకుల కోలాహలాలు పండుగ శోభను సంతరింపజేశాయి. ప్రతి సంవత్సరం ఒక కళాశాల విద్యార్థిని విద్యార్థులను సంబరాల్లో పాల్గొనేలా చేసి వారికి సంస్కృతి సాంప్రదాయాలను పండుగ ప్రాధాన్యతను తెలియపరిచేలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

కర్నూలు జిల్లా:జిల్లాలో ఘనంగా సంక్రాంతి సంబరాలు ప్రారంభమయ్యాయి. విద్యా సంస్థల్లో నేటి నుంచి సెలవులు రావడంతో ముందస్తుగా ప్రైవేటు విద్యా సంస్థల్లో సంక్రాంతి సంబరాలు జరుపుకున్నారు. కర్నూలు నగరంలోని మాంటీస్సొరి పాఠశాలలో సంక్రాంతి పాటలకు విద్యార్థులు నృత్యాలు చేశారు. చిన్నారులకు రేగిపళ్లతో ఉపాధ్యాయులు ఆశీర్వదించారు. సంప్రదాయలను విద్యార్థులకు తెలియజేయాలన్న ఉద్దేశ్యంతో ఈకార్యక్రమం నిర్వహించామని అధ్యాపకురాలు తెలిపారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details