ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jun 23, 2023, 1:29 PM IST

ETV Bharat / state

High Interest Cheating: అధిక వడ్డీ పేరుతో బ్యాంక్ ఉద్యోగి మోసం.. లబోదిబోమంటున్న బాధితులు

SBI Employee Cheat Customers: అధిక వడ్డీ ఆశ చూపి బ్యాంకుకు వచ్చే ఖాతాదారుల ఖాతాలను ఖాళీ చేశాడో బ్యాంక్ మెసేంజర్. మొదట్లో చెప్పిన సమయానికే వడ్డీ ఇచ్చేస్తుంటే పూర్తిగా నమ్మేసిన అమాయకులు అధిక మొత్తంలో డబ్బులు ఇవ్యడం మొదలు పెట్టారు. ఇప్పుడు ఆ మెసేంజర్ డబ్బులతో ఉడాయిండటంతో బాధితులు లబోదిబోమంటున్నారు. ఈ ఘరానా మోసం ఏలూరు జిల్లాలో వెలుగు చూసింది.

High Interest Cheating
అధిక వడ్డీ పేరుతో మోసం చేసిన బ్యాంక్ మేనేజర్

అధిక వడ్డీ ఇస్తానని ఆశ చూపి డబ్బుతో పరారైన ఎస్బీఐ ఉద్యోగి

SBI Employee Cheat Customers : ఏలూరు జిల్లాలో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. అధిక వడ్ఢీ పేరుతో బ్యాంకుకు వచ్చే ఖాతాదారులైన అమాయక ప్రజల నుంచి కోట్లలో వసూలు చేసి పరారైనట్లు బాధితులు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ దృష్టికి తీసుకెళ్లారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం లింగపాలెం మండలం ధర్మాజీగూడెంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియలో మెసేంజర్​గా పని చేస్తున్న బొబ్బర బాబూరావు గత నాలుగు సంవత్సరాలుగా బ్యాంకుకు వచ్చే మహిళా సంఘాలు, ఎక్కువ మొత్తంలో నగదు డిపాజిట్ చేసే వారిని గుర్తించి బ్యాంక్​లో వేస్తే తక్కువ వడ్ఢీ వస్తుంది తనకి ఇస్తే 2 రూపాయల వరకు వడ్డీ ఇస్తానని అధిక వడ్డి ఆశ చూపాడు. బ్యాంక్​కు వచ్చే ఖాతాదారుల నుంచి సుమారు మూడు కోట్ల రూపాయలు వసూళ్లు చేసినట్లు బాధితులు వాపోతున్నారు.

కొంతకాలం అందరికీ సక్రమంగా ప్రతి నెలా ఒకటో తేదీన వడ్డీ ఇస్తుండటంతో అతడి మాయ మాటలు నమ్మి మరికొందరు లక్షలు తెచ్చి బాబూరావు చేతిలో పెట్టారు. అయితే గత మూడు నెలలుగా బాబూరావు వడ్డీ ఇవ్వకపోవడంతో బాధితులు తమ నగదు ఇవ్వాలని ఒత్తిడి తెచ్చారు. దీంతో అతడు ఇటీవల పరారైనట్లు తెలుస్తోంది.

విషయం తెలుసుకున్న బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు వారి వద్ద ఉన్న ఆధారాలను బట్టి కోర్టుకు వెళ్లాలని సూచించారు. దీనిపై ఏం చేయాలో తెలియక బాధితులు చింతలపూడి మండలం శీతానగరం గ్రామంలో జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేశ్​ని, స్థానిక ఎమ్మెల్యే ఎలీజాని కలసి తమకు న్యాయం చేయాలని కోరారు. వెంటనే విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని వారు హామీ ఇచ్చారు.

'బ్యాంకులో గ్రూపు డబ్బులు కడుతుంటే బాబురావు వచ్చేవాడు. బ్యాంకులో కడితే తక్కువ వడ్డీ వస్తుందని తనకి ఇస్తే ఎక్కువ వడ్డీ ఇస్తానని మమల్ని నమ్మించాడు. కొన్ని రోజులు కొద్ది కొద్దిగా ఇచ్చాడు. తరువాత ఇవ్వడం మానేశాడు. ఇప్పుడు అతని ఆచూకీ కనిపించడం లేదు. ఇప్పుడు ఊరుఊరుంతా బాధపడుతున్నాం. ఎస్​ఐ కోర్టులో చూసుకోండని అంటున్నాడు. మమల్ని పట్టించుకునే నాథుడే లేడు. కోర్టు వెళ్లడానికి మా దగ్గర ఓపిక లేదు. మాకు న్యాయం చేస్తారని ఎమ్మెల్యే ఎలీజా దగ్గరుకు వచ్చాం.'- బాధితురాలు

'బాబురావు అనే వ్యక్తి ధర్మాజీగూడెంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియలో పని చేస్తున్నాడు. బ్యాంకుకు వచ్చే పేదల దగ్గర అధిక వడ్డీ ఇస్తానని చెప్పి డబ్బులు తీసుకున్నాడు. మాకు డబ్బులు ఇవ్వకుండా ఎక్కడికి వెళ్లాడో ఆచూకీ కూడా తెలియం లేదు.'- బాధితుడు

ABOUT THE AUTHOR

...view details