ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నాలుగు తరాల కుటుంబ సభ్యులను ఒక్కటి చేసిన సంక్రాంతి..ఎక్కడంటే? - Eluru District festivals news

Four generations of family members Meet: సంక్రాంతి పండుగ అంటేనే కుటుంబ సభ్యులను ఏకం చేసే పండుగ. పుట్టిన ఊరి నుంచి ఉద్యోగాల రీత్యా, వ్యాపారాల రీత్యా, చదువుల రీత్యా వివిధ దేశాల్లో, వివిధ రాష్ట్రాల్లో, పట్టణాల్లో స్థిరపడినా సంక్రాంతి పండుగకు మాత్రం తప్పకుండా సొంత ఊరికి రావాల్సిందే, కుటుంబ సభ్యులను, బంధువులను కలిసి తీరాల్సిందే. అలా నాలుగు తరాలకు చెందిన కుటుంబ సభ్యులందరూ ఒక్కచోట కలిస్తే ఎలా ఉంటుందో భవిష్యత్‌ తరాలకు చూపించారు ఏలూరు జిల్లా వాసులు.

eluru
అడుసుమిల్లి, జాస్తి కుటుంబాలు

By

Published : Jan 16, 2023, 11:01 PM IST

Updated : Jan 17, 2023, 6:28 AM IST

నాలుగు తరాల కుటుంబ సభ్యులను ఒక్కటి చేసిన సంక్రాంతి

Four generations of family members Meet: సాధారణంగా పండగలన్నీ తిథిని బట్టే వస్తాయి. కానీ తిథితో సంబంధం లేకుండా సౌరమానం ప్రకారం వచ్చేది సంక్రాంతి పండుగ. మన పండగల్లో ఆధ్యాత్మికం, కుటుంబం, సామాజికం.. ఇలా మూడు అంశాలు ఇమిడి ఉంటాయి. సంక్రాంతికి కుటుంబ ప్రాధాన్యతే ప్రథమం. మిగిలినవన్నీ తర్వాత. సంస్కృతీ సంప్రదాయాలకి మూలమైన కుటుంబ వ్యవస్థను బలోపేతం చేస్తూ.. ఇంటిల్లి పాదినీ ఏకంచేసే పండగిది.

అంతేకాదు, సంవత్సరమంతా సుఖసంతోషాలను, శాంతిని పంచుతుంది. అందుకే ఎవరెక్కడున్నా కుటుంబసభ్యులందరినీ ఒక చోటుకు చేరుస్తుంది. అటు పుట్టింటిని, ఇటు మెట్టింటిని రెండు కళ్లుగా భావించే మనం పురుషుల కన్నా కాస్త ఎక్కువ సమానమంటే అతిశయం కాదు. అందుకే సంక్రాంతి సంబరాలు, ఆచారాలు స్త్రీలే కేంద్రంగా సాగుతాయి.

ఏలూరు రూరల్ మండలం జాలిపూడి గ్రామానికి చెందిన అడుసుమిల్లి, జాస్తి కుటుంబాలకు చెందిన నాలుగు తరాల కుటుంబ సభ్యులందరినీ ఏకం చేసింది ఈ సంక్రాంతి పండుగ. దేశ విదేశాల్లో స్థిరపడిన వారందిరి కలయికకు పుట్టిన ఊరు వేదికైంది. అడుసుమిల్లి, జాస్తి కుటుంబాలు... సంక్రాంతి పండుగ సందర్భంగా ఒక్క చోటుకి చేరాయి. పిల్లలు, పెద్దలు ఇలా నాలుగు తరాలకు చెందిన వారంతా సొంత ఊరులో పండుగను ఘనంగా జరుపుకున్నారు.

అనంతరం ఆటపాటలతో సరదాగా సందడి చేశారు. సంబంధ బాంధవ్యాలు కృత్రిమంగా మారిపోతున్న తరుణంలో.. భవిష్యత్‌ తరాలకు కుటుంబ విలువలు, పండుగల ఔన్నత్యం చాటిచెప్పాలనే ఉద్దేశంతోనే..ప్రతి ఏటా అందరూ స్వగ్రామానికి వచ్చి పండుగ జరుపుకుంటామని అడుసుమిల్లి, జాస్తి కుటుంబ సభ్యులు తెలిపారు.

ఇవీ చదవండి

Last Updated : Jan 17, 2023, 6:28 AM IST

ABOUT THE AUTHOR

...view details