Purandeswari Press Meet: రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్రాభివృద్దికి అన్ని విధాలా భారతీయ జనతా పార్టీ సహకరిస్తోందని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. సంపూర్ణ మద్యపాన నిషేధమని అధికారంలోకి వచ్చిన వైసీపీ.. సొంత కంపెనీలు పెట్టిందని ఏలూరులోని భాజపా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో విమర్శించారు. మద్యం మీద వచ్చే ఆదాయానికి కూడా రుణం తీసుకునే విషయాన్ని ప్రజలందరూ గమనించాలన్నారు. రాష్ట్రంలో మద్యంపై డిజిటల్ పేమెంట్స్ ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో పేదల కోసం నిర్మిస్తున్న ఇళ్లకు జగనన్న కాలనీ అని పేరు పెట్టడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇల్లు కట్టుకునేందుకు లక్షా ఎనబై వేల రూపాయలు కేంద్రం ఇస్తుంటే.. రాష్ట్ర ప్రభుత్వం తమ వాటా కింద ఒక్క రూపాయి కూడా ఇవ్వటం లేదన్నారు. 2024కి కూడా పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యే పరిస్థితి కనిపించడం లేదని ఎద్దేవా చేశారు.
వైకాపా ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచుతోంది: పురందేశ్వరి - eluru
Purandeswari Press Meet: రాష్ట్రాన్ని వైకాపా ప్రభుత్వం అప్పులపాలు చేస్తోందని మండిపడ్డారు భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురందేశ్వరి. మద్యనిషేధమన్న వైకాపా.. అధికారంలోకి వచ్చాక సొంత కంపెనీలు పెట్టుకుందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలకు పేర్లు మార్చుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
దగ్గుబాటి పురందేశ్వరి
"రాష్ట్రంలో దాడులు, అత్యాచారాలు పెరిగిపోయాయి. మద్యపాన నిషేధమని అధికారంలోకి వచ్చిన వైకాపా దానిని అమలు చేయడం లేదు. తెలుగుదేశం ఉన్నప్పుడు రెండున్నర లక్షల కోట్ల అప్పు ఉంటే.. ప్రస్తుతం అది ఎనిమిది లక్షల కోట్లకు చేరింది" - దగ్గుబాటి పురందేశ్వరి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి
ఇవీ చదవండి:
Last Updated : Dec 16, 2022, 9:05 PM IST