Polavaram: ఉమ్మడి కృష్ణాజిల్లాలో 54 కిలోమీటర్ల మేర పోలవరం కాలువ ప్రవహిస్తోంది. ఈ కాలువ నిర్మాణం సమయంలో..పూడిక తీసిన మట్టిని గట్టుకు వేశారు. ఇప్పుడు ఆ మట్టిని కొందరు అధికార పార్టీ నేతలు పదుల సంఖ్యలో జేసీబీలతో తవ్వేస్తున్నారు. ఇలానే కొనసాగితే గట్టుకే ప్రమాదం ఏర్పడే అవకాశమున్నా... అధికారులు పట్టించుకోవడం లేదు. ప్రధానంగా గన్నవరం పరిధిలో ఈ మట్టి తవ్వకాలు అధికంగా జరుగుతున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. సూరంపల్లి పరిధిలోనూ రాత్రి, పగలు తేడా లేకుండా పెద్దఎత్తున మట్టి తవ్వకాలు జరుగుతూనే ఉన్నాయి. విజయవాడ-నూజివీడు రాహదారి సమీపంలోనూ చాలాచోట్ల తవ్వుతున్నారు.
అయితే వివిధ పనుల కోసం పరిమిత మెుత్తంలో తవ్వకాలకు అనుతులు ఇచ్చినట్లు అధికారులు అనధికారికంగా చెబుతున్నారు. గనుల శాఖ నుంచి అధికార పార్టీ నేతలేఅనుమతులు పొందినట్లు తెలిసింది. వీరికి స్థానిక రెవెన్యూ అధికారులూ వత్తాసు పలుకుతున్నారంటూ జనం ఆరోపిస్తున్నారు. వందల టిప్పర్లతో ఎర్రమట్టి తరలిస్తూ కొందరు కోట్ల రూపాయలు సొమ్ము చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.