ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Neglect on Polavaram Residents Colony: ముఖం చాటేసిన ప్రభుత్వం... కాలనీల్లో కనీస సౌకర్యాల్లేక పోలవరం నిర్వాసితుల అవస్థలు - పోలవరం నిర్వాసిత కాలనీ వసతుల లేమి

Neglect on Polavaram Residents Colony: రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు కోసం సర్వం త్యాగం చేసి కట్టుబట్టలతో పునరావాస కాలనీలకు వచ్చిన నిర్వాసితులను వసతుల లేమి వెక్కిరిస్తోంది. సౌకర్యాలు కల్పిస్తామని ఊదరగొట్టిన ప్రభుత్వం.. సమస్యల పరిష్కారానికి వచ్చే సరికి ముఖం చాటేసింది. కనీస సౌకర్యాలు లేక పునరావాసాల కాలనీల్లో ఉండలేక, తిరిగి సొంత ఊళ్లకు వెళ్లలేక నిర్వాసితుల పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా తయారైంది.

Neglect on Polavaram Residents Colony
Neglect on Polavaram Residents Colony

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 19, 2023, 9:50 AM IST

Updated : Oct 19, 2023, 12:41 PM IST

Neglect on Polavaram Residents Colony: పోలవరం నిర్వాసిత కాలనీ ప్రజల్ని వెక్కిరిస్తున్న వసతుల లేమి

Neglect on Polavaram Residents Colony :పోలవరం ప్రాజెక్టు ముంపు మండలాల నిర్వాసితులకు ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం తాడువాయి పంచాయతీ పరిధిలోని చల్లవారిగూడెంలో పునరావాస కాలనీలు ఏర్పాటు చేస్తున్నారు. సుమారు 3 వేల మందికి ఇక్కడ ఇళ్లు నిర్మిస్తుండగా ప్రస్తుతం పోలవరం, వేలేరుపాడు, కుక్కునూరు మండలాలకు చెందిన 500 కుటుంబాలు మాత్రమే ఇక్కడ నివాసం ఉంటున్నాయి. మిగిలిన ఇళ్లు నిర్మాణ దశలో ఉన్నాయి.

Polavaram Project Area People Not Get Package :ఏటా గోదావరికి వరదలు రావడం.. బతుకు జీవుడా అంటూ బయటకు రావడం.. ఇలా విసిగి వేసారిపోవడంతో కొన్ని కుటుంబాలు పునరావాస కాలనీలకు వచ్చి నివాసం ఉంటున్నాయి. ప్యాకేజీ సొమ్ము కోసం ఇప్పటికీ కొంత మంది ముంపు ప్రాంతాల్లోనే బతుకు వెళ్లదీస్తున్నారు. ప్రస్తుతం కాలనీల్లో ఉంటున్న వారు మౌలిక వసతుల లేమితో అల్లాడుతున్నారు.

పోలవరం నిర్వాసితులు ధర్నా.. పునరావాసం కల్పించాలని డిమాండ్

CM Jagan Leave Polavaram Project Residents Promises :పోలవరం ముంపు మండలాలకు చెందిన నిర్వాసిత కాలనీలను పట్టణాల స్థాయిలో రూపొందిస్తామని ప్యాకేజీతో సహా అన్ని వసతులు కల్పించి ముంపు ప్రజలను తరలిస్తామని ముఖ్యమంత్రి జగన్‌ గతంలో పలుమార్లు హామీ ఇచ్చారు. కానీ అవన్నీ ఆచరణలోకి రాలేదు. మొన్నటి వరకు అదిగో ప్యాకేజ్‌.. ఇదిగో ప్యాకేజీ అంటూ ఆశ రేపిన సీఎం జగన్‌.. ఇటీవల కుక్కునూరు మండలం కొమ్ముగూడెం సాక్షిగా ప్యాకేజీ చెల్లింపు తన చేతిలో లేదంటూ చేతులెత్తేశారు. దీంతో ముంపు ప్రజల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.

Flooded Villages of Polavaram are Suffering :వాస్తవానికి ముంపు బాధితులను పునరావాస కాలనీలకు తరలించే సమయానికి అక్కడ ఆసుపత్రి, తాగునీరు, రహదారులు ఇలా పలురకాల మౌలిక సదుపాయాలు కల్పించాలి. అవేమీ ఏర్పాటు చేయకుండానే నిర్వాసితులను తరలించేశారు. రహదారుల దుస్థితి అధ్వాన్నంగా ఉంది. చాలా వీధుల్లో కేవలం కంకర వేసి చేతులు దులుపుకొన్నారు. తాగునీటి కోసం ట్యాంకర్లు ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూడాల్సిన దుస్థితి నిర్వాసితులది. చాలా ఇళ్లు ఖాళీగా ఉండటంతో పిచ్చి మొక్కలు పెరిగి విషసర్పాలు నివాసాల్లోకి వస్తున్నాయని వాపోతున్నారు.

Polavaram: ప్రతిపక్షంలోనే కాదు.. సీఎం పదవిలోనూ అంతే.. మాటిచ్చి మడమ తిప్పి..

నిర్వాసితులు కాలనీల్లోకి వచ్చి మూడేళ్లు గడుస్తున్నా రవాణా సౌకర్యాల కల్పనలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. ప్రభుత్వ రవాణా అందుబాటులో లేకపోవడంతో విద్యార్థులు పాఠశాల, కళాశాలలకు వెళ్లేందుకు అవస్థలు పడుతున్నారు. ఆపత్కర పరిస్థితుల్లో చికిత్స అందించేందుకు ఆసుపత్రి లేదని వాపోతున్నారు. ఇక అంగన్వాడీ, ప్రాథమిక పాఠశాలల సదుపాయాలు సరేసరి.

నిర్వాసితులకు ప్రభుత్వం ఉపాధి కల్పించకపోవడంతో నిరుద్యోగులు, ప్రజలు ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందని అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్యాకేజీ చెల్లింపుల్లో ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తోందని మండిపడుతున్నారు. తమ సమస్యలపై దృష్టి పెట్టాలని అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకున్న పాపాన పోలేదని వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

జలదిగ్భందంలోనే గ్రామాలు..పోలవరం నిర్వాసితుల వెతలు!

Last Updated : Oct 19, 2023, 12:41 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details