nara lokesh on cm meeting : జగన్ దెబ్బకి జనం పరార్ అంటూ ముఖ్యమంత్రి జగన్.. ఏలూరు జిల్లా గణపవరం సభకు సంబంధించి పలు వీడియోలను తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విడుదల చేశారు. రైతుల్ని దగా చేసిన జగన్ రెడ్డి చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలు అనడానికి.. ఇంతకన్నా ఆధారాలు ఇంకేం కావాలని ప్రశ్నించారు. ఈ మేరకు తన ట్విట్టర్‌కు వీడియోను జత చేశారు.
NARA LOKESH: 'జగన్ దెబ్బకి.. జనం పరార్.. ఇంతకన్నా ఆధారాలు ఏం కావాలి' - సీఎం సభపై నారాలోకేశ్ కామెంట్స్
nara lokesh on cm meeting : సీఎం జగన్ గణపవరం సభకు సంబంధించిన పలు వీడియోలను తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విడుదల చేశారు. రైతుల్ని దగా చేసిన జగన్ రెడ్డి చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలు అనడానికి ఇంతకన్నా ఆధారాలు ఇంకేం కావాలని ప్రశ్నించారు.
ఇదీ జరిగింది: ఏలూరు జిల్లా గణపవరంలో 4వ విడత రైతు భరోసా నగదు బదిలీ సభలో ముఖ్యమంత్రి జగన్ పాల్గొన్నారు. సభలో సీఎం జగన్ ప్రసంగిస్తుండగానే మహిళలు సభ నుంచి వెళ్లిపోయారు. ముందుగా జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు ప్రసంగించారు. అనంతరం ముఖ్యమంత్రి ప్రసంగం మధ్యలోనే సభ వెనుక ఉన్న మహిళలు.. సభ నుంచి వెళ్లిపోవడం కనిపించింది. భారీ స్థాయిలో మహిళలు వెళ్లిపోవడంతో సభా ప్రాంగణం బోసిపోయింది. సభ నుంచి వెళ్తున్న మహిళలను ఆపడానికి వాలంటీర్లు, పోలీసులు ప్రయత్నించారు. అయినా మహిళలు బలవంతంగా వెళ్లిపోయారు. బలవంతంగా సభకు తీసుకెళ్లారని.. తాము వెళ్లిపోతామని పలువురు మహిళలు తెలిపారు. ఎండలు అధికంగా ఉండటంతో సభ ప్రాంగణంలో మహిళలు కూర్చోలేకపోయారు.
ఇవీ చదవండి:No people: సీఎం ప్రసంగిస్తుండగానే... సభ నుంచి వెళ్లిపోయిన మహిళలు