The lorry driver filed a case against the transport officials: రవాణా శాఖ అధికారులు తనను లంచం అడిగారని.. ఇవ్వనందుకు తన లారీపై అక్రమంగా కేసు నమోదు చేశారని జిల్లా కలెక్టర్‌కు అలాగే పోలీస్ స్టేషన్లోనూ ఫిర్యాదు చేశాడు ఓ లారీ డ్రైవర్. ఈ సంఘటన ఏలూరు జిల్లాలో చోటు చేసుకుంది. తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లా మక్తల్‌కు చెందిన లారీ డ్రైవర్ రాజు.. పత్తి లోడుతో తణుకు వస్తుండగా ఏలూరు కలపర్రు టోల్గేట్ వద్ద రవాణా శాఖ అధికారులు ఆపారు. పత్రాలన్నీ నిబంధన ప్రకారమే ఉన్నా.. రూ.15 వేలు డిమాండ్ చేశారని బాధితుడు తెలిపాడు. డబ్బులు ఇవ్వడానికి నిరాకరించడంతో అధిక లోడు ఉన్నట్లు చెప్పి.. రూ.20 వేలు చలానా రాశారని.. కాళ్ళ మీద పడి బతిమాలినా.. వినకుండా లారీని ఆర్టీవో కార్యాలయానికి తరలించారని ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు న్యాయం చేయాలంటూ ఏలూరు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో, జిల్లా కలెక్టర్‌కు బాధితుడు ఫిర్యాదు చేశాడు.
లంచం అడిగిన రవాణాశాఖ అధికారులు.. కలెక్టర్‌కు లారీ డ్రైవర్ ఫిర్యాదు - transport officials demanding bribe in eluru
The lorry driver filed a case against the transport officials: మనం ఎప్పుడైనా వాహనం మీద వెళ్లినప్పుడు పోలీసులు పట్టుకుంటే వారికి ఎంతో కొంత లంచం ఇచ్చి బయటపడతాం కానీ ఏలూరు జిల్లాలో ఓ లారీ డ్రైవర్ రవాణా శాఖ అధికారులు లంచం అడిగారని ఏకంగా కలెక్టర్‌కే ఫిర్యాదు చేశాడు.
లారీ డ్రైవర్ రాజు