ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

33 వేల మద్యం బాటిళ్లపై.. ప్రొక్లయినర్ ఎక్కించారు! - ఏలూరు తాజా వార్తలు

Liquor Destroy: ఏలూరు జిల్లావ్యాప్తంగా పలు కేసుల్లో స్వాధీనం చేసుకున్న అక్రమ మద్యాన్ని.. పోలీసులు ధ్వంసం చేశారు. మొత్తం 33,933 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకోగా.. వాటి విలువ సుమారు రూ.80లక్షలు ఉంటుందని పోలీసులు పేర్కొన్నారు.

liquor bottles destroy
ఏలూరులో మద్యం బాటిళ్ల ధ్వంసం

By

Published : Jun 30, 2022, 1:46 PM IST

Updated : Jun 30, 2022, 7:38 PM IST

Liquor Destroy: ఏలూరు జిల్లావ్యాప్తంగా పలు కేసుల్లో స్వాధీనం చేసుకున్న అక్రమ మద్యాన్ని.. పోలీసులు నాశనం చేశారు. జిల్లాలోని 7 ఎస్‌ఈబీ సర్కిళ్ల పరిధిలో.. 2021 నుంచి 2022 మార్చి వరకు 1,083 అక్రమ మద్యం కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో 33,933 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకోగా.. ఏలూరు ఆశ్రమ హాస్పటల్ ఎదురుగా ఆటోనగర్ రైల్వే క్వార్టర్స్‌ వద్ద వాటిని ధ్వంసం చేశారు. ఈ మొత్తం బాటిళ్ల విలువు రూ.80లక్షలు గా పోలీసులు తెలిపారు. మరో 70వేల మద్యం బాటిళ్లను త్వరలోనే ధ్వంసం చేయనున్నట్లు పేర్కొన్నారు.

33 వేల మద్యం బాటిళ్లపై.. ప్రొక్లయినర్ ఎక్కించారు!

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు.. చెక్​పోస్టులు, ఇతర ప్రాంతాల్లో ఆకస్మిక దాడులు నిర్వహించి అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకుంటున్నట్లు.. జిల్లా ఎస్పీ తెలిపారు. ప్రజల ఆరోగ్యాలకు హానికలిగించే నాటు సారా తయారీ కేంద్రాలపై ఉక్కుపాదం మోపుతామని , నాటుసారా తయారీకి ఉపయోగించే సామాగ్రిని సరఫరా చేసే వారిపై చర్యలు చేపడతామన్నారు. అక్రమ మద్యం విక్రయిస్తే.. నిందితులపై పీడీ యాక్ట్ నమోదు పరుస్తామని హెచ్చరించారు.

ఇవీ చూడండి:

Last Updated : Jun 30, 2022, 7:38 PM IST

ABOUT THE AUTHOR

...view details