జనసేన అధినేత పవన్‌కల్యాణ్ నేడు ఏలూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలను ఆయన పరామర్శించి ఆర్థికసాయం చేయనున్నారు. ఏలూరు మీదుగా పెదవేగి, లింగపాలెం మండల నుంచి చింతలపూడికి పవన్ చేరుకోనున్నారు. అనంతరం చింతలపూడిలో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొంటారని ఆ పార్టీ నాయకులు నాదెండ్ల మనోహర్ తెలిపారు. పవన్ పర్యటన అడ్డుకునేందుకు మరమ్మతుల పేరిట రహదారులపై గుంతలు తవ్వుతున్నారని విమర్శించారు. కౌలు రైతులకు ఒక్కో కుటుంబానికి రూ. లక్ష రూపాయల ఆర్థిక సాయాన్ని అందిస్తామని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.
Pawan Kalyan: ఏలూరు జిల్లాలో పవన్‌కల్యాణ్ పర్యటన...కౌలు రైతులకు ఆర్థిక సాయం! - Janasena chief Pawan Kalyan latest news
జనసేన అధినేత పవన్‌కల్యాణ్ కౌలు రైతులకు ఆర్థిక సాయం అందజేసేందుకు నేడు ఏలూరు జిల్లాలో పర్యటించనున్నారు. అనంతరం చింతలపూడిలో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొంటారని ఆ పార్టీ నాయకులు నాదెండ్ల మనోహర్ తెలిపారు. కౌలు రైతులకు ఒక్కో కుటుంబానికి రూ. లక్ష రూపాయల ఆర్థిక సాయాన్ని అందిస్తామని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ఇప్పటికే ప్రకటించారు.
Pawan Kalyan