Ambati Rambabu criticized Chandrababu: పోలవరం వద్ద రాజకీయ కార్యక్రమాలకు అనుమతి లేదని.. పోలవరంలో పర్యటించే ముందు చంద్రబాబు మూడు ప్రశ్నలకు సమాధానం చెప్పాలని.. నీటిపారుదలశాఖ మంత్రి అంబటి రాంబాబు సవాల్ విసిరారు. పోలవరం ప్రాజెక్టు వద్ద రాజకీయ కార్యక్రమాలకు అనుమతి లేదని తెలిపారు. ఈ విషయం పోలీసులు చెప్పినా తెలుగుదేశం నేతలు పట్టించుకోలేదని విమర్శించారు. డయాఫ్రం వాల్ అంటే నాకు తెలియదని చంద్రబాబు చెప్పారని.. తనకు తెలుసో? తెలియదో? అధికారులు, ప్రజలకు తెలుసని ఆయన పేర్కొన్నారు.
మూడు ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం చెప్పాలి: మంత్రి అంబటి రాంబాబు - చంద్రబాబుకు మంత్రి అంబటి మూడు ప్రశ్నలు
Irrigation Minister Ambati Rambabu: పోలవరంలో పర్యటించే ముందు చంద్రబాబు మూడు ప్రశ్నలకు సమాధానం చెప్పాలని నీటిపారుదలశాఖ మంత్రి అంబటి రాంబాబు సవాల్ విసిరారు. పోలవరం ప్రాజెక్టు వద్ద రాజకీయ కార్యక్రమాలకు అనుమతి లేదని, ఈ విషయం పోలీసులు చెప్పినా తెలుగుదేశం నేతలు పట్టించుకోలేదని విమర్శించారు.
Ambati Rambabu
కాఫర్ డ్యాం నిర్మించకుండా డయాఫ్రం వాల్ చేయడం తప్పిదం కాదా..? పోలవరం ఖర్చు కేంద్రం భరించాలని చట్టంలో ఉంది. పోలవరం ప్రాజెక్టు పూర్తి వ్యయం కేంద్రం భరించాలని చట్టంలో ఉంటే.. గతంలో రాష్ట్రం ఎందుకు నెత్తిన వేసుకుందో చెప్పాలి -అంబటి రాంబాబు, మంత్రి
ఇవీ చదవండి: