ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వరి రైతుల కష్టం వర్షార్పణం - ప్రభుత్వం నిబంధనలు సడలించి ఆదుకోవాలని వేడుకోలు

Huge Loss to Paddy Farmers in Eluru District : అకాల వర్షాలు రైతుల పాలిట శాపంగా మారాయి. ఆరుగాలం కష్టించిన పంట చేతికందిన సమయానికి వానలపాలైయ్యాయి. పొలాల్లో నీళ్లు చేరాయి. తేమశాతం, నిబంధనలు సడలించి ధాన్యం కొనుగోలు చేసి ఆదుకోవాలని ఏలూరు జిల్లా అన్నదాతలు కోరుకుంటున్నారు.

Huge_Loss_to_Paddy_Farmers_in_Eluru_District
Huge_Loss_to_Paddy_Farmers_in_Eluru_District

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 25, 2023, 9:16 AM IST

Updated : Nov 25, 2023, 12:09 PM IST

Huge Loss to Paddy Farmers in Eluru District :అకాల వర్షాలు రైతుల కొంప ముంచుతున్నాయి. ఆరుగాలం కష్టించి రేపో మాపో కోతలు కోసి.. ధాన్యం నూర్పిడి చేద్దామనుకుంటున్న తరుణంలో వర్షాలు పడటంతో పొలాల్లో నీళ్లు చేరటంతో వందలాది ఎకరాల్లో వరి పొంట (Paddy Crop) నేలకొరిగింది. మరోవైపు ఇప్పటికే కోతలు కోసి ఆరబెట్టిన ధాన్యమూ తడిసిపోవడంతో.. రైతులు దిగులు చెందుతున్నారు. పంట వర్షార్పణం కావడంతో... అదనపు ఖర్చులు తప్పడం లేదు. తేమశాతం, నిబంధనలు సడలించి ధాన్యం కొనుగోలు చేసి.. ఆదుకోవాలని ఏలూరు జిల్లా అన్నదాతలు వేడుకుంటున్నారు.

Farmers Problems With Untimely Rains :అకాల వర్షాలు రైతుల నడ్డివిరుస్తున్నాయి. మొన్నటి వరకు నీళ్లు లేక పంటలు ఎలా కాపాడుకోవాలో తెలియక రైతులు నానా పాట్లు పడగా.. ఇప్పడు తీరా పంట చేతికొచ్చే సమయానికి అకాల వర్షంతో రైతులకు కడగండ్లు తప్పడంలేదు. ఏలూరు జిల్లాలోని దెందులూరు, పెదపాడు, పెదవేగి మండలాలతో పాటు భీమడోలు మండలంలోని పలు ప్రాంతాల్లో గురువారం రాత్రి కురిసిన వర్షాలకు వందలాది ఎకరాల్లో వరి పంట నీట మునగడంతో పాటు నేలకొరిగింది. అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టి పంట చేతికొస్తుందనుకున్న సమయంలో అకాల వర్షం రైతుల ఆశలపై నీళ్లు చల్లింది.

అకాల వర్షాలతో అన్నదాతలకు కన్నీరు - ఆదుకోవాలని విన్నపం

Untimely Rains in AP :విత్తనాలు చల్లడం దగ్గర నుంచి కోత దశ వరకు దాదాపు ఎకరాకు రూ.40 వేల వరకు రైతులు పెట్టుబడులు పెట్టగా.. రేపోమాపో కోతలు కోస్తామనుకున్న తరుణంలో అకాల వర్షం రైతులను అవస్థల పాలు చేసింది. పంట చేలల్లో చేరిన నీళ్లు సకాలంలో బయటకు పోతే తప్ప వర్షం కారణంగా నీట మునిగిన వరి పొలాలు పని చేసే అవకాశం లేదని రైతులు చెబుతున్నారు. నీటిలో నానడం వల్ల ధాన్యం రంగు మారుతుందని.. ఆ ధాన్యాన్ని ప్రభుత్వం కొనే పరిస్థితి ఉండదని రైతులు చెబుతున్నారు. అకాల వర్షాలతో రైతులు నష్టపోకుండా తేమ శాతాన్ని తగ్గించి సకాలంలో ధాన్యాన్ని కొనేలా ఏర్పాట్లు చేయాలని రైతులు కోరుతున్నారు.

Heavy Rains in State: విస్తారంగా వర్షాలు.. పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు

Eluru Paddy Farmers Huge Loss Due to Untimely Rains :వర్షం కారణంగా తడిసిన ధాన్యాన్ని పొలం నుంచి గట్టుకి తీసురావడంతో పాటు ధాన్యాన్ని ఆరబెట్టడం, తిరగేయడం, సంచులకెత్తడం ఇలా ఎకరాకు అదనంగా రూ.10 వేల వరకు ఖర్చవుతోందని రైతులు ఆవేదన చెందుతున్నారు. వర్షాలు ఇలాగే కొనసాగితే ఇప్పట్లో ధాన్యం ఆరే పరిస్థితి ఉండదని అదనపు ఖర్చే పెట్టుబడులను దాటిపోతుందని చెబుతున్నారు.అకాల వర్షాలతో ఏటా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, వాతావరణానికి తోడు అదనపు ఖర్చుల కారణంగా కౌలు రైతులకు ఏమీ మిగలడం లేదని వాపోతున్నారు. ప్రభుత్వాలు సైతం కౌలు రైతులను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో అటు ప్రభుత్వం, ఇటు మిల్లర్లు కొర్రీలు పెట్టకుండా సకాలంలో ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

Farmers Fire on Govt: అకాల వర్షాలతో మొలకెత్తిన ధాన్యం.. అయోమయంలో రైతన్న

వరి రైతుల కష్టం వర్షార్పణం - ప్రభుత్వం నిబంధనలు సడలించి ఆదుకోవాలని వేడుకోలు
Last Updated : Nov 25, 2023, 12:09 PM IST

ABOUT THE AUTHOR

...view details