రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ అడుగుజాడల్లో ముఖ్యమంత్రి జగన్ నడుస్తున్నారనేందుకు తామే నిదర్శనమని హోంమంత్రి తానేటి వనిత అన్నారు. ఏలూరు జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలో నిర్వహించిన అంబేడ్కర్ జయంతి వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. అంబేడ్కర్ ఆశయ సాధనకు తాము నిరంతరం కృషి చేస్తామని హోంమంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వైకాపా కార్యకర్తలు పాల్గొన్నారు.
అంబేడ్కర్ ఆశయ సాధనకు నిరంతరం కృషి చేస్తాం: హోంమంత్రి తానేటి - అంబేడ్కర్ జయంతి లేటెస్ట్ న్యూస్
రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ ఆశయ సాధనకు నిరంతరం కృషి చేస్తామని హోంమంత్రి తానేటి వనిత అన్నారు. అంబేడ్కర్ అడుగుజాడల్లో ముఖ్యమంత్రి జగన్ నడుస్తున్నారనేందుకు తామే నిదర్శనమని అన్నారు.

అంబేడ్కర్ అడుగుజాడల్లో సీఎం జగన్