రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తా: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
laxminarayana: వచ్చే ఎన్నికల్లో విశాఖ ఎంపీగా పోటీ చేయనున్నట్లు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. తన భావాలకు అనుగుణంగా ఉన్న పార్టీలో చేరేందుకు అభ్యంతరం లేదన్న ఆయన.. స్వతంత్ర అభ్యర్థిగానైనా పోటీ చేస్తానన్నారు. రాష్ట్ర విభజన అంశాలపై అన్ని రాజకీయ పార్టీలు చర్చించుకుని ఏకాభిప్రాయానికి వస్తే మంచిదని తెలిపారు.
laxminarayana : విశాఖ ఎంపీగా రానున్న ఎన్నికల్లో పోటీ చేయనున్నట్టు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. తన భావాలకు అనుగుణంగా ఉన్న పార్టీలో చేరేందుకు తనకు అభ్యంతరం లేదని.. స్వతంత్ర అభ్యర్థిగానైనా విశాఖ ఎంపీగా పోటీ చేస్తానని విశాఖ వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన అంశం న్యాయస్థానం ఎదుట ఉందని అయితే అన్ని రాజకీయ పార్టీలు కలిసి ఈ అంశంపై చర్చించుకుని ఏకాభిప్రాయానికి రావడం కూడా మంచిదేనని అన్నారు. ఎన్నికల సందర్భంగా తాను ప్రకటించిన హామీలను నెరవేర్చకుంటే.. తనపై క్రిమినల్ చర్యలు తీసుకోవచ్చని గత ఎన్నికల్లోనే ప్రకటించానన్నారు. జేడీ ఫౌండేషన్ ద్వారా ఎస్సై, కానిస్టేబుల్ పోస్టులకు నిర్వహించే పరీక్షలకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్టు లక్ష్మీనారాయణ తెలిపారు.
ఇవీ చదవండి: