పోలవరం ప్రాజెక్టులోని కార్మికులకు అస్వస్థత - ap latest telugu news
11:05 February 11
కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురైన 40 మంది కార్మికులు
Food Poison to Polavaram Workers: పోలవరం ప్రాజెక్టులోని కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. పోలవరం ప్రాజెక్టులో పనిచేయటానికి వివిధ రాష్ట్రాల నుంచి కార్మికులు వచ్చారు. అందులో కలుషిత ఆహారం తిన్న 40 మంది కార్మికులు అస్వస్థతకు గురైనట్లు సమాచారం. కలుషిత ఆహరం తినటంతో కార్మికులకు వాంతులు, విరేచనాలు కలిగాయి. అంతేకాకుండా కొంతమంది కడుపు నొప్పితో బాధపడుతున్నట్లు తెలిసింది. దీంతో వారిని పోలవరం సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు.ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవీ చదవండి :