ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

స్పిన్నింగ్ మిల్లులో అగ్నిప్రమాదం... భారీగా ఆస్తినష్టం - అగ్ని ప్రమాదం

Spinnig mill fire Accident: ఏలూరు జిల్లా దెందులూరు మండలం ముప్పవరం పరిధిలోని ఎర్ర స్పిన్నింగ్ మిల్ లో ఆదివారం అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో సుమారు 7కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని ఎర్ర స్పిన్నింగ్ మిల్ మేనేజింగ్ డైరెక్టర్ తెలిపారు. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.

Spinnig mill fire Accident
Spinnig mill fire Accident

By

Published : Nov 13, 2022, 10:57 PM IST

Fire Accident in Spinnig mill: ఏలూరు జిల్లా దెందులూరు మండలం ముప్పవరం పరిధిలోని ఎర్ర స్పిన్నింగ్ మిల్లులో ఆదివారం అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో సుమారు 7కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని ఎర్ర స్పిన్నింగ్ మిల్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాస రావు తెలిపారు. పరిశ్రమలోని బ్లోజర్ వద్ద స్పార్క్ రావడంతో ఒక్కసారిగా మంటలు తలెత్తాయని చెప్పారు. పరిశ్రమ లోపల ఉన్న అగ్ని నిరోధక యంత్రాలు ద్వారా మంటలను ఆర్పడానికి ప్రయత్నం చేసినా.. సఫలం కాలేదు. దీనితో భీమడోలు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో వారు హుటాహుటిన అగ్నిప్రమాద ప్రాంతానికి చేరుకొని మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు.

సమాచారం అందుకున్న జిల్లా అగ్నిమాపక అధికారి మాల్యాద్రి హుటాహుటినా సంఘటన స్థలానికి చేరుకోవడంతోపాటు ఇతర ప్రాంతాల నుంచి అగ్నిమాపక వాహనాలను రప్పించి మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. పరిశ్రమకు సమీపంలో నీరు అందుబాటులో లేకపోవడంతో కూడా నష్టం వాటిల్లింది. పరిశ్రమలోని రా మెటీరియల్ తో పాటు తయారైన సామాగ్రి, మిషనరీ, భవనం బాగా దెబ్బతిన్నాయి. ఏలూరు ఆర్డీవో పెంచల కిషోర్, దెందులూరు తహసీల్దార్ నాంచారయ్య సంఘటన స్థలానికి చేరుకొని ప్రమాద వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రమాదంలో ఇద్దరికీ స్వల్ప గాయాలయ్యాయి.

స్పిన్నింగ్ మిల్ లో అగ్నిప్రమాదం

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details