DEGREE COLLEGE: ఈ వీడియోలో కనిపించేది.. పాడుబడిన నివాస భవనాలు కాదు. విద్యార్థులు పాఠాలు వినే తరగతి గదులు..! అవును నిజమే..! ఒకటి, రెండేళ్లు కాదు..! దశాబ్దన్నరకుపైగా.. విద్యార్థులకు ఇక్కడే బోధించారు..! తరగతి గదుల్లో పైకప్పునకు చిల్లులతో పుస‌్తకాలపైనో, బోర్డుపైనో సూర్యకిరణాలు ప్రత్యక్షమవుతాయి. ఇక..కాంపౌండ్‌లో చూసేంతదూరం..ఇలా గుబురుగా పెరిగిన గడ్డిమొక్కలే కనిపిస్తాయి..
ఏలూరులో ఉన్న ఈ ఏకైక ప్రభుత్వ డిగ్రీ కళాశాలను.. కోటదిబ్బ ప్రాంతంలోని జూనియర్ కళాశాల ఆవరణలో.. 2008లో ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఇక్కడ 240 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. దాదాపు పదిహేనేళ్లు కావస్తున్నా.. సొంత భవనాలు, సౌకర్యాల్లేవు. కళాశాల ఆవరణలో ఉన్న పాఠశాల సహా..ఇంటర్మీడియట్‌కు చెందిన రేకు షెడ్లు, ఇతర గదుల్నే వినియోగిస్తున్నారు. ఈమూడు గదుల్లోనే ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇయర్ విద్యార్థులకు బోధిస్తున్నారు. కొన్ని తరగతులకు చెట్లకిందే బోధన..! తమ ఇబ్బందీ ఇదేనంటున్నారు విద్యార్థులు..! ప్రభుత్వం కళాశాలను అభివృద్ధి చేస్తే సరి..లేకుంటే ప్రైవేటులో చేరేవాళ్లం కదా అని ప్రశ్నిస్తున్నారు.