ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఖాకీల నీడలో మునుగోడు.. 2 వేల మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు - Rachakonda CP Bhagwat meeting

Heavy Security For Munugode Bypoll: తెలంగాణ మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న మునుగోడు ఉపఎన్నికకు పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. ఎన్నికల విధుల్లో ఉన్న రెండు వేల మంది పోలీసులతో చౌటుప్పల్​లో రాచకొండ సీపీ భగవత్ సమావేశం నిర్వహించారు.​ పోలింగ్ రోజు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా గట్టి చర్యలు తీసుకున్నట్లు ఆయన వివరించారు.

Heavy Security For Munugode Bypoll
Heavy Security For Munugode Bypoll

By

Published : Nov 2, 2022, 8:11 PM IST

Heavy Security For Munugode Bypoll: తెలంగాణలో మునుగోడు ఉపఎన్నిక పోలింగ్‌ ప్రశాంతంగా జరిగేలా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టినట్లు రాచకొండ సీపీ మహేశ్‌భగవత్‌ తెలిపారు. మునుగోడు నియోజకవర్గంలోని 7మండలాల్లో చౌటుప్పల్‌, సంస్థాన్‌ నారాయణపుర్‌ మండలాలు రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో ఉన్నాయి. ఉపఎన్నిక జరుగుతున్న ఈ రెండు మండలాల్లో భద్రతకు సంబంధించిన ఏర్పాట్లపై ఆయన పోలీస్‌ అధికారులకు ఆయన దిశానిర్దేశం చేశారు.

ఎన్నికల వేళ భద్రతాచర్యల్లో పాల్గొననున్న 2వేల మంది పోలీసులతో చౌటుప్పల్‌లో సీపీ మహేష్​ భగవత్‌ సమావేశమయ్యారు. హింసాత్మక ఘటనలకు అవకాశమున్న కేంద్రాలను గుర్తించి.. ప్రత్యేక బలగాలను ఏర్పాటు చేసినట్లు సీపీ తెలిపారు. రాష్ట్ర పోలీసులు, కేంద్ర బృందాలతో బందోబస్తు ఉంటుందని.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా చర్యలు చేపట్టినట్లు సీపీ వివరించారు.

పటిష్ట బందోబస్తులో నిమగ్నమైన 2 వేల మంది పోలీసులు

"మునుగోడులో 35 సున్నిత ప్రాంతాలను గుర్తించాం. అలాంటి ప్రదేశాలలో రాష్ట్ర పోలీసులు, కేంద్ర బృందాలతో బందోబస్త్ ఏర్పాటు చేశాం. మొత్తం ఎన్నికల్లో 2వేల మందితో భద్రతను ఏర్పాటు చేశాం. మొదటి సారిగా ప్రతి పోలింగ్​ కేంద్రంలో కేంద్ర బలగాలు ఉంటారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో కనీసం 9 మంది సిబ్బంది ఉంటారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో సీసీ కెమెరాల నిఘా ఉంటుంది. చెక్‌పోస్టులు రేపు ఎన్నికలు ముగిసే వరకు ఉంటాయి. గత ఎన్నికల్లో హింసకు పాల్పడిన వారిని బైండ్ ఓవర్ చేశాం. ఇప్పటివరకు రూ.4 కోట్ల నగదు, వెయ్యి లీటర్ల మద్యం, 3.5కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నాం".- మహేశ్​ భగవత్​, రాచకొండ సీపీ

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details