ఏడాదిలో పూర్తి చేస్తామన్నారు.. ఎప్పటికి పూర్తయ్యేనో.. రోగులు ఎదురుచూపులు Chintalapudi Hundred Bed Area Hospital: ఏలూరు జిల్లా చింతలపూడి వంద పడకల ఆస్పత్రి మూడేళ్లుగా.. నిర్మాణ దశలోనే ఉండటంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏడాదిలో పూర్తి చేస్తామంటూ 2020 నవంబర్ 19న ఆస్పత్రి నిర్మాణానికి అప్పటి మంత్రి ఆళ్ల నాని శంకుస్థాపన చేశారు. నాటి నుంచి నేటి వరకూ ఆళ్ల నాని ఆస్పత్రి వైపు కన్నెత్తి చూడలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం, అధికారులు పట్టించుకోకపోవడంతో.. ఆస్పత్రి నిర్మాణం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
చింతలపూడిలోని ప్రాంతీయ ఆస్పత్రి మూడేళ్లుగా నిర్మాణంలోనే ఉంది. ఏలూరు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి 60 కిలోమీటర్ల దూరంలో ఉండటంతో పరిసర ప్రాంత ప్రజలు వైద్యం కోసం 30 పడకల సామర్థ్యం ఉన్న ఈ ఆస్పత్రికే ఎక్కువగా వస్తుంటారు. ఏలూరు, కృష్ణా జిల్లాతో పాటు తెలంగాణ నుంచి సైతం రోగులు వచ్చే ఈ ఆస్పత్రిని 100 పడకలకు పెంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
Nadu Nedu: పేరు గొప్ప ఊరు దిబ్బ.. నత్తనడకన నాడు నేడు రెండో దశ నిర్మాణ పనులు
25 కోట్ల రూపాయల నాబార్డు నిధులతో నిర్మించేందుకు 2020 నవంబర్ 19న అప్పటి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని శంకుస్థాపన చేశారు. ఏడాదిలోగా నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు మెరుగైన వైద్య సేవలందిస్తామన్న ఆళ్ల నాని.. నాటి నుంచి నేటి వరకు ఆస్పత్రి వైపు కన్నెత్తి చూడలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.
శంకుస్థాపన చేసి మూడేళ్లు పూర్తైనా.. ఇప్పటికీ ఆస్పత్రి నిర్మాణ పనులు నత్తనడకన సాగుతుండటంపై పట్టణవాసులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఇప్పుడున్న 30 పడకల ఆస్పత్రిలోనూ సరైన వసతులు లేవని వాపోతున్నారు. ప్రసూతి వైద్యులు, ల్యాబ్ టెక్నీషియన్ల కొరతతో దూర ప్రాంతాల నుంచి వచ్చే రోగులకు అరకొర వైద్యమే అందుతోందని చెబుతున్నారు. వంద పడకల నూతన ఆసుపత్రిని త్వరితగతిన పూర్తిచేసి నిరుపేద రోగులకు మెరుగైన వైద్య సేవలందించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.
Power Bills Burden: కరెంటు షాక్ కొట్టిన కాకుల్లా రాష్ట్ర ప్రజలు.. ఇదేం బాదుడన్నా అంటూ ఆవేదన
"చింతలపూడి ప్రాంతంలో ఉండే ప్రజల కల. ఈ వంద పడకల ఆసుపత్రి నుంచి ప్రజలు ఎంతోకాలంగా ఎదురుచూస్తుంటే.. ప్రభుత్వం మాత్రం ఆసుపత్రిని పూర్తి చేయలేక పోతోంది. ఏవో నత్తనడకన పనులు సాగుతున్నాయి. దీంతో వైద్య చేయించుకునేందుకు అనేక మంది ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఈ ఆసుపత్రిని వీలైనంత వేగంగా పూర్తి చేయాలని మేము కోరుతున్నాం". - రామిశెట్టి సత్యనారాయణ, చింతలపూడి వాసి
"చింతలపూడి ఆసుపత్రికి నిత్యం కృష్ణా జిల్లా నుంచి, తెలంగాణ నుంచి వందలాది మంది ప్రజలు వస్తూ ఉంటారు. అప్పటి మంత్రి ఆళ్ల నాని ఈ వంద పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేశారు. ఈ ఆసుపత్రి త్వరతగతిన పూర్తి చేస్తే.. అనేక మంది ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉంటారు. అదే విధంగా ప్రస్తుతం ఉన్న ఆసుపత్రిలో సరైన సౌకర్యాలు లేవు". - మారుమూడి థామస్, చింతలపూడి వాసి
నత్తనడకన రోడ్డు విస్తరణ పనులు.. ప్రజలకు ఇబ్బందులు