ప్రతిపక్ష నేత హోదాలో పోలవరాన్ని సందర్శించిన చంద్రబాబు Chandrababu Visits Polavaram: పోలవరం దుస్థితి చూస్తే కన్నీళ్లొస్తున్నాయని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర జీవనాడైన ప్రాజెక్టుకు జగన్ జీవం లేకుండా చేశారని మండిపడ్డారు. కాన్వాయ్, భద్రత లేకుండానే పోలవరం పనులను పరిశీలించిన చంద్రబాబు ఒకింత భావోద్వేగానికి గురయ్యారు.
ప్రతిపక్ష నేత హోదాలో ప్రాజెక్టు సందర్శన: ముఖ్యమంత్రిగా ప్రతీ సోమవారాన్ని పోలవరంగా మార్చుకుని పనులు ముందుకు నడిపించిన తెలుగుదేశం అధినేత చంద్రబాబు ప్రతిపక్ష నేత హోదాలో తొలిసారి ప్రాజెక‌్టును సందర్శించారు. సాగునీటి ప్రాజెక్టులపై యుద్ధభేరి కార్యక్రమంలో భాగంగా దాదాపు 3గంటలపాటు కలియతిరిగారు.
Chandrababu Selfie Challenge: చింతలపూడి ప్రాజెక్టు వద్ద చంద్రబాబు సెల్ఫీ ఛాలెంజ్
కాలినడక ద్వారా పరిశీలన: తొలుత స్పిల్‌వే వద్దకు వెళ్లారు. 1.8 కిలోమీటర్ల పొడవైన స్పిల్‌వేపై కాలినడక ద్వారా పరిశీలించారు. స్పిల్ వే చివర కుంగిన గైడ్ బండ్‌నూ సందర్శించారు. అనంతరం ప్రాజెక్టు దిగువకు రెండు కిలోమీటర్లు వెళ్లి దెబ్బతిన్న కాఫర్ డ్యామ్‌లను కారు ఫుట్ బోర్డు మీద నిల్చుని ప్రయాణిస్తూ పరిశీలించారు.
డ్యాం సైట్‌లో పనులు పడకేశాయి: ఎగువ కాఫర్ డ్యాం చివర జరుగుతున్న పవర్ ప్రాజెక్టు పనులు తిలకించారు. అక్కడి నుంచి లోయర్ కాపర్ డ్యాం మీదుగా ఎర్త్ కం రాక్‌ఫిల్ డ్యాంను పరిశీలిస్తూ.. తిరిగి అప్పర్ కాపర్ డ్యాంపైకి చేరుకున్నారు. డ్యాం సైట్‌లో పనులు పడకేశాయంటూ చంద్రబాబు ఆవేదనకు గురయ్యారు.
Chandrababu visited Sri Balaji Reservoir: చిత్తూరులో వైసీపీ నేతలు 1147 ఎకరాల చెరువులను ఆక్రమించారు..: చంద్రబాబు
70శాతంపైగా పోలవరం పనులు టీడీపీ హయంలోనే పూర్తి: పోలవరం పనులు 72 శాతం తెలుగుదేశం హయాంలోనే పూర్తయ్యాయన్న చంద్రబాబు, వైసీపీ ఎంత శాతం పనులు పూర్తి చేసిందో చెప్పాలని జగన్‌కు సెల్ఫీ ఛాలెంజ్ విసిరారు. అసలు 41.15 మీటర్ల ఎత్తు వరకే నీరు నిలబెట్టాలనే.. ఆలోచన ఎందుకు చేస్తున్నారని నిలదీశారు.
"ఏమీ లేదిక్కడ. అన్ని పడకేశాయి. ఆ ఇంజనీర్లు పది మంది తిరుగుతున్నారు. పోలవరం రాష్ట్రానికి వరమనుకుంటే.. మీ పిచ్చి చేష్టల వల్ల శాపంగా తీసుకువచ్చారు. 43సార్లు పోలవరం దగ్గరికి వచ్చాను. 86సార్లు వర్చువల్‌గా సమీక్షించాను. అంత కష్టపడి పనులు ముందుకు నడిపించిన దానిని ఇలా చూస్తే.. బాధ, ఆవేదన వస్తున్నాయి" -చంద్రబాబు
Chandrababu Selfie Challenge at KIA: కరవు నేలపై ఎవరైనా కియా పరిశ్రమను ఊహించారా..?: చంద్రబాబు
పురుషోత్తపట్నం ప్రాజెక్ట్‌ను పరిశీలించనున్న టీడీపీ అధినేత: డయాఫ్రంవాల్ నుంచి సీపేజ్ అరికట్టలేకపోతే ప్రాజెక్టు కట్టలేమన్న చంద్రబాబు అడుగడుగునా తప్పుడు నిర్ణయాలతో పోలవరాన్ని నాశనం చేశారని దుయ్యబట్టారు. సోమవారం రాత్రి వరకే రాజమహేంద్రవరం చేరుకున్న చంద్రబాబు ఈ రోజు మధ్యాహ్నం పురుషోత్తపట్నం ప్రాజెక్ట్ ఫేజ్-1ను పరిశీలించనున్నారు. ఆ తర్వాత కోరుకొండలో రోడ్‌షో నిర్వహించనున్నారు.
Chandrababu Comments on CM Jagan: బడ్జెట్‌లో కేవలం 2.35 శాతం ఖర్చు చేస్తే.. ప్రాజెక్టుల నిర్మాణం సాధ్యమా?: చంద్రబాబు