CBN FIRES ON CM JAGAN : ప్రజలను మోసం చేసి జగన్ అధికారంలోకి వచ్చారని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. ఏలూరు జిల్లా ధర్మాజీగూడెంలో విద్యార్థులతో చంద్రబాబు ముఖాముఖి నిర్వహించారు. మీ తర్వాత మిగతా వారి భవిష్యత్తు కోసం ఆలోచించాలని సూచించారు. అభివృద్ధి చేయాల్సిన పాలకుడు విధ్వంసం చేస్తున్నాడని మండిపడ్డారు. భవిష్యత్తు తరాల పరిస్థితిపై విద్యార్థులు ఆలోచించాలన్నారు. రాష్ట్రాన్ని కాపాడుకుంటారో లేక బలిపశువులవుతారో మీ చేతుల్లోనే ఉందని ప్రశ్నించగా.. రాష్ట్రాన్ని కాపాడుకుంటాం కానీ బలిపశువులు కాబోమని విద్యార్థులు నినాదాలు చేశారు.
ముఖాముఖిలో విద్యార్థుల ప్రశ్నలు.. చంద్రబాబు సమాధానాలు
విద్యార్థి ప్రశ్న: మీ ఆరోగ్య రహస్యం ఏంటి?
చంద్రబాబు సమాధానం:మన మైండ్‌ను నియంత్రిస్తూ ఇష్టపడి పని చేయాలి. ఏం తినాలో? ఎంత తినాలో? జాగ్రత్తలు తీసుకోవాలి.