ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆంధ్రాలో బౌద్ధారామం.. రాతి ఫలకాలతో ప్రాచీన వైభవం - ఆంధ్రాలో బౌద్ధారామం

కనువిందు చేసే ప్రకృతి సోయగంలో కొండలూ గుహలూ ఓ భాగం. ఏలూరు జిల్లాలోని జీలకర్ర గూడెంలో గుంటుపల్లి గుహలు సౌందర్య చిహ్నాలుగా, చారిత్రక సాక్ష్యాలుగా నిలిచాయి. ఆంధ్ర ప్రాంతంలో బౌద్ధమతం విరాజిల్లిందని చాటుతున్నాయి.

buddha temple in eluru district
ఆంధ్రాలో బౌద్ధారామం

By

Published : May 19, 2022, 6:58 AM IST

ఆంధ్రాలో బౌద్ధారామం

ఏలూరు జిల్లాలోని జీలకర్ర గూడెంలో గుంటుపల్లి గుహలు సౌందర్య చిహ్నాలుగా, చారిత్రక సాక్ష్యాలుగా నిలిచాయి. ఆంధ్ర ప్రాంతంలో బౌద్ధమతం విరాజిల్లిందని చాటుతున్నాయి. ఇవి బౌద్ధమత ఆరంభ కాలం నాటి ఆరామాలని చెబుతారు. ఇక్కడి పెద్ద స్తూపం (ధర్మలింగేశ్వరాలయం) చుట్టూ రాతి మెట్ల ప్రదక్షిణ మార్గం ఉంది. ఇసుక రాతి కొండను తొలిచి ఏర్పాటు చేసిన చిన్న చిన్న గదుల్లో బౌద్ధ భిక్షువులు నివాసముండేవారట.

ఆంధ్రాలో బౌద్ధారామం

కొండ కింద ఉన్న ప్రాంతాన్ని పెద్ద బౌద్ధారామంగా, కొండ మీద గల ఐదు గదుల సముదాయాన్ని చిన్న బౌద్ధారామంగా పిలుస్తారు. మొక్కు స్తూపాలుగా పిలిచే ఇక్కడి 60కి పైగా స్తూపాలను కోరిన కోరికలు తీర్చినందుకు ప్రతిఫలంగా నిర్మించారని చెబుతారు. బౌద్ధభిక్షువుల సమావేశ మందిరం, వృత్తాకార స్తూప చైత్యం, రాతి ఫలకాలతో ప్రాచీన వైభవాన్ని చాటుతుందీ ప్రాంతం. ‘ఆంధ్రా అజంత’గా గుర్తింపు పొందిన ఈ గుంటుపల్లి గుహలకు వెళ్లేందుకు ఏలూరు నుంచి బస్సు మార్గం ఉంది. గోపన్నపాలెం, పెదవేగి, కూచింపూడి మీదుగా జీలకర్ర గూడెం చేరుకోవచ్చు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details