విద్యుత్ రాయితీని గతంలో మాదిరిగానే అందరికీ కొనసాగించకుండా ప్రభుత్వం కొత్తగా పరిమితులను విధించిందని ఆక్వా రైతులు మండిపడుతున్నారు. నిలకడలేని ధరలతో ఆక్వా సాగు వల్ల నష్టాలను చవిచూడాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మేతల ధరల నియంత్రణ లేకుండా విపరీతంగా పెరగడంతో సాగు వ్యయం గణనీయంగా పెరిగిందని వాపోతున్నారు. ఆక్వా జోన్ల పరిధిలో ఉండి పది ఎకరాల్లోపు ఉన్న రైతులకే విద్యుత్ రాయితీ వర్తిస్తుందని ప్రభుత్వం ప్రకటించడం సమంజసంగా లేదని రైతులు చెబుతున్నారు.
సమస్యల సుడిగుండంలో ఆక్వారంగం.. పోరు తప్పదంటున్న రైతులు - ఆక్వా రైతులు తాజా వార్తలు
వేల కోట్ల విదేశీ మారకద్రవ్యాన్ని అందించే ఆక్వా పరిశ్రమ.. నేడు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. మారిన పరిస్థితుల నేపథ్యంలో సాగు గిట్టుబాటు కాకపోవడంతో.. రొయ్యలు సాగు చేసిన రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. వైకాపా ప్రభుత్వం విద్యుత్ రాయితీపై పరిమితులు విధించడం, ఆక్వా జోన్ల విధానం తెరపైకి తీసుకురావడం, గిట్టుబాటు ధర ఇతర సమస్యలు ఆక్వా రైతులను తీవ్ర ఒడిదుడుకులకు లోనుచేస్తోంది.
పోరుబాటకు సిద్ధమైన రైతులు
ప్రభుత్వం నాణ్యమైన రొయ్యపిల్లల సరఫరాను చేపట్టాలని, ఆక్వా జోన్లతో సంబంధం లేకుండా రాయితీపై యూనిట్ విద్యుత్ రూపాయిన్నరకే అందించాలని డిమాండ్ చేస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్ తరహాలో రైతులకు కనీసం పదిహేను రోజుల వరకు గిట్టుబాటు ధర నిలకడగా ఉండేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించకుంటే పోరుబాట తప్పదని ఆక్వా రైతులు హెచ్చరిస్తున్నారు.
ఇవీ చూడండి