పోలవరాన్ని అద్భుత పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దండి: సీఎం జగన్ CM Jagan visited the Polavaram project: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఈరోజు పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. తాడేపల్లిలోని తన నివాసం నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్‌లో బయలుదేరి వెళ్లిన సీఎం.. విహంగ వీక్షణం ద్వారా పోలవరం ప్రాజెక్టును పరిశీలించారు. పరిశీలనలో భాగంగా పోలవరం ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్ పనుల పురోగతిపై అధికారులతో చర్చించారు. డయాఫ్రమ్ నిర్మాణ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఛాయా చిత్ర ప్రదర్శనను తిలకించారు. ఆ తర్వాత పోలవరం ప్రాజెక్ట్ పురోగతిపై అధికారులు, ప్రాజెక్టు ఇంజినీర్లతో సమీక్షా జరిపిన సీఎం.. పలు కీలక ఆదేశాలను జారీ చేశారు.
పోలవరం పనుల పురోగతిపై చిత్ర ప్రదర్శన.. సీఎం జగన్ నేడు పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. తాడేపల్లి నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో పోలవరం చేరుకున్న జగన్.. తొలుత విహంగ వీక్షణం చేశారు. ఆ తర్వాత పోలవరంఎగువ, దిగువ కాఫర్ డ్యామ్ పనుల పురోగతిని పరిశీలించారు. పురోగతి పనుల గురించి మంత్రి అంబటి రాంబాబు, అధికారులు సీఎంకు వివరించారు. అనంతరం దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్, ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్ పనుల్ని జగన్ స్వయంగా పరిశీలించారు. డయాఫ్రమ్ వాల్ ప్రాంతంలో వైబ్రో కాంపాక్షన్ పద్ధతిలో ఇసుకను కూర్చడం వంటి పనులను వీక్షించారు. ప్రాజెక్టు వివిధ దశల్లో జరుగుతున్న పనుల పురోగతిపై ఏర్పాటు చేసిన చిత్ర ప్రదర్శనను సీఎం తిలకించారు.
వంతెన నిర్మించి పర్యాటక ప్రాజెక్టుగా తీర్చిదిద్దాలి.. అనంతరం దెబ్బతిన్న పోలవరం డయాఫ్రమ్ వాల్ పనుల్ని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సీఎం జగన్ అధికారుల్ని ఆదేశించారు. పోలవరం ప్రాజెక్టు ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్.. డయాఫ్రమ్ వాల్ పనులను ఈరోజు సీఎం పరిశీలించారు. పునరావాస కాలనీల్లో అన్ని సౌకర్యాలు కల్పించాలని.. పోలవరం వద్ద మంచి వంతెన నిర్మించి అద్భుత పర్యాటక ప్రాజెక్టుగా పోలవరాన్ని తీర్చిదిద్దాలని సూచించారు.
సాధ్యమైనంత త్వరగా పోలవరాన్ని పూర్తి చేయండి.. ఈ నేపథ్యంలో అధికారులతో సీఎం జగన్ సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. సాధ్యమైనంత త్వరగా ప్రాజెక్టు పూర్తి చేసేలా శ్రమించాలని ఆదేశించారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధుల్ని పూర్తి స్థాయిలో రాబట్టుకోవడంతో పాటు వేగంగా పనులు పూర్తయ్యేలా చూడాలని కోరారు. దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్‌ను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సీఎం సూచించగా.. డిసెంబర్ నాటికి పనులు పూర్తి చేసే కార్యాచరణతో ముందుకు వెళ్తున్నట్లు అధికారులు వివరించారు.
పోలవరాన్ని అద్భుత పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దండి..చివరగా పోలవరం నిర్వాసితుల పునరావాసంపైనా కూడా ముఖ్యమంత్రి జగన్ సమీక్షించారు. పురనావాస కాలనీల్లో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలన్నారు. దీంతో నిర్వాసితుల్లో 12వేల 658 కుటుంబాలను.. ఇప్పటికే తరలించామని అధికారులు తెలిపారు. పోలవరం వద్ద వంతెన నిర్మించి.. అద్భుత పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేలా చర్యలు తీసుకోవాలని సీఎం అధికారుల్ని ఆదేశించారు.