ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

POLAVARAM: డయాఫ్రమ్ వాల్‌ విషయంలో... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో సందిగ్ధత - పోలవరం వార్తలు

పోలవరం ప్రాజెక్టులో కీలకమైన డయాఫ్రమ్‌ వాల్‌ను పునరుద్ధరించాలా.. లేక కొత్తది కట్టాలా అనే విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో సందిగ్ధత కొనసాగుతోంది. కేంద్ర జల్‌శక్తి, పోలవరం ప్రాజెక్టు అథారిటీ, ఏపీ జలవనరులశాఖ అధికారులు.... దీనిపై మరింత లోతైన అధ్యాయనం చేయాల్సి ఉందని అభిప్రాయపడుతున్నారు. దీని అధ్యాయనానికి జాతీయ, అంతర్జాతీయ స్థాయి నిపుణులు అవసరమని భావిస్తున్నారు. ఇసుక కోతకు గురైన ప్రాంతాల్లో ఏం చేయాలన్నదానిపైనా... అధికార యంత్రాంగం మల్లగుల్లాలుపడుతోంది.

Polavaram
Polavaram

By

Published : May 24, 2022, 5:16 AM IST

డయాఫ్రమ్ వాల్‌ విషయంలో... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో సందిగ్ధత

వరదల కారణంగా దెబ్బతిన్న పోలవరం డయాఫ్రామ్ వాల్ విషయంలో ఏం చేయాలన్నదానిపై ప్రభుత్వం లోతుగా అధ్యయనం చేస్తోంది. డయాఫ్రామ్ వాల్ నిర్మాణం దెబ్బతిన్న ప్రాంతాల్లో సమాంతరంగా మరో డయాఫ్రామ్ నిర్మించాలా లేక పూర్తిగా కొత్తదాన్నే నిర్మించాలా అన్న విషయమై కేంద్ర జలశక్తిశాఖ, పోలవరం ప్రాజెక్టు అథారిటీ, ఏపీ జలవనరుల శాఖ ఆలోచనలో పడ్డాయి. వరదల కారణంగా ఇసుక కోతకు గురై ఏర్పడిన అగాధాలను పూడ్చే అంశంపైనా నిపుణుల అభిప్రాయాలను తీసుకోవాలని భావిస్తున్నారు. ఇప్పటికే దిల్లీ ఐఐటీతో పాటు విదేశీ ప్రతినిధుల్ని కూడా సంప్రదించినట్టు తెలుస్తోంది. 1.7 కిలోమీటర్ల పొడవున నిర్మించిన డయాఫ్రమ్ వాల్‌లో గత రెండేళ్లుగా వచ్చిన వరదల కారణంగా 300 మీటర్ల మేర ప్రాంతం ఇసుక కోతకు గురై దెబ్బతింది. దీని అధ్యయనం పూర్తయ్యేంత వరకూ తదుపరి ఈసీఆర్ఎఫ్ పనులు చేపట్టే అవకాశం లేదని తెలుస్తోంది. మరోవైపు... కోతకు గురైన ప్రాంతాల్లో ఇసుకను నింపేందుకు ఈసీఆర్ఎఫ్ డ్యామ్‌కు దిగువన 8 కిలోమీటర్ల వద్ద... తవ్వకం చేసి తెచ్చి నింపాలని భావిస్తున్నారు. ఉపరితలం నుంచి 4 మీటర్ల దిగువన నాణ్యమైన ఇసుక దాదాపు 80 లక్షల క్యూబిక్ మీటర్ల మేర ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దాన్ని తరలించి కోతకు గురైన చోట్ల నింపాలని నిర్ణయించారు.

ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌ల సమీపంలో ఇసుక కోతకు గురైన ప్రాంతాల్లోనూ నాణ్యమైన ఇసుకను నింపి వైబ్రో కాంపాక్షన్ ద్వారా గట్టిపరచాలని నిర్ణయించారు. ఇప్పటికే ఐదు ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా వైబ్రో కాంపాక్షన్ విధానం ద్వారా గట్టిపరిచే ప్రయత్నాలు చేయాలని భావిస్తున్నారు. అయితే డయాఫ్రమ్ వాల్ ఎంతమేర దెబ్బతిందో పూర్తిగా తెలిసేంత వరకూ తదుపరి పనులు చేపట్టలేమని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది.

ఇదీ చదవండి:POLAVARAM: ధ్వంసమైన డయాఫ్రం వాల్‌పై ఎలా ముందుకెళ్లాలి?

ABOUT THE AUTHOR

...view details