ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'పోలవరం డయాఫ్రమ్ వాల్​పై నిర్ణయం అప్పుడే..' - నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్

Polavaram Diaphragm Wall: పోలవరం ప్రాజెక్ట్‌ డయాఫ్రమ్‌ వాల్‌ స్థితిగతులపై.. నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్ ఇచ్చే నివేదిక ఆధారంగా పనులు చేపడతామని జలవనరుల శాఖమంత్రి అంబటి రాంబాబు అన్నారు. ప్రాజెక్ట్​కు సంబంధించి అప్పర్, లోయర్ కాఫర్ డ్యాం, డయాఫ్రమ్ వాల్, గ్యాప్-1 పనులను అధికారులతో కలిసి మంత్రి పరిశీలించారు. డయాఫ్రమ్ వాల్ పూర్తిగా నీటిలో మునిగిపోయిందని.. మోటార్ల సాయంతో నీటిని తోడుతున్నామని ఆయన తెలిపారు.

Ambati Rambabu
పోలవరం ప్రాజెక్ట్

By

Published : Nov 13, 2022, 7:21 PM IST


Ambati Rambabu conducted a review on polavaram: పోలవరం ప్రాజెక్ట్​లోని డయాఫ్రమ్ వాల్ పరిస్థితిని నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్ పరిశీలించిన తరువాత.. వారి సూచనల మేరకు ప్రాజెక్ట్ పనులలో ముందుకెళ్తామని జలవనరుల శాఖమంత్రి అంబటి రాంబాబు అన్నారు. ప్రాజెక్ట్​కు సంబంధించి అప్పర్, లోయర్ కాఫర్ డాం, డయాఫ్రమ్ వాల్, గ్యాప్-1 పనులను అధికారులతో కలిసి మంత్రి పరిశీలించారు. ప్రస్తుతం గోదావరికి వరద తగ్గుముఖం పట్టిందని,.. 50 వేల క్యూసెక్కులకు పైగా నీటిని కిందకు విడుదల చేశామని మంత్రి తెలిపారు. ప్రాజెక్ట్ పనులు ముమ్మరంగా చేపట్టేందుకు.. ఏజెన్సీ సర్వసన్నద్ధంగా ఉందన్నారు. ప్రస్తుతం డయాఫ్రమ్ వాల్ స్థితిగతులపై నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్ నివేదిక ఇచ్చిన తరువాత.. వాటి ఆధారంగా పనులు చేపట్టవలసి ఉంటుందన్నారు.

డయాఫ్రమ్ వాల్ పూర్తిగా నీటిలో మునిగి ఉందని, నీటిని మోటార్ల సాయంతో బయటకు తోడుతున్నామన్నారు. ప్రస్తుతం లోయర్ కాఫర్ డాం పనులు ప్రారంభించామన్నారు. డయాఫ్రమ్ వాల్ కొత్తది నిర్మించాలా.. లేక పాత డయాఫ్రమ్ వాల్ మీదే ఎర్త్ కం రాక్​ఫిల్ డాంను నిర్మించాలా అన్నది నిర్ణయించడం జరుగుతుందన్నారు. అంతవరకు లోయర్ కాఫర్ డాం నిర్మాణ పనులను ముమ్మరం చేసి.. సాధ్యమైనంత త్వరలో పూర్తి చేయడం జరుగుతుందని మంత్రి చెప్పారు.

జలవనరుల శాఖామంత్రి అంబటి రాంబాబు

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details