Young Woman got a place in Telugu Book of Records: తెలంగాణలోని సూర్యాపేటకు చెందిన ఓ యువతి.. హనుమకొండలో 24 గంటల పాటు నిరంతర ప్రసంగం చేసి తెలుగు బుక్ ఆఫ్ రికార్డుకు ఎక్కింది. ప్రియాంక అనే యువతి సూర్యాపేట నగరంలోని వాగ్ధేవి కళాశాలలో బీఫార్మసీ చదివి క్లినికల్ రీసెర్చ్‌లో ఫార్మసిస్ట్‌గా ఉద్యోగం చేస్తోంది. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్, గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్... ఇలా వరల్డ్ రికార్డు కోసం ప్రియాంక హనుమకొండలో 24 గంటల నిరంతర స్పీచ్ 'సన్ రైజ్ టు సన్ రైజ్' ప్రారంభించారు. ఆదివారం ఉదయం 9 గంటలకు ప్రారంభించిన ప్రియాంక.. సోమవారం ఉదయం 9 గంటల వరకు నిరంతరంగా ప్రసంగించింది.
24 గంటల పాటు యువతి స్పీచ్.. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు - Telangana latest news
young woman got a place in Telugu Book of Records: సూర్యాపేటకు చెందిన ప్రియాంక అనే యువతి 24 గంటల పాటు నిరంతర ప్రసంగం చేసి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించింది. క్లీనికల్ రిసెర్చ్‌లో ఉద్యోగం చేస్తున్న ఈ యువతి హనుమకొండలోని 'సన్రెజ్ టూ సన్‌రైజ్' అనే ప్రసంగాన్ని ఆదివారం ఉదయం 9 గంటల నుంచి సోమవారం ఉదయం 9 గంటల వరకు నిరంతరంగా ప్రసంగించి అందరి ప్రశంసలు అందుకుంది.
క్లినికల్ రీసెర్చ్, డాటా మేనేజ్మెంట్పై 24 గంటలు నిర్విరామంగా ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ జ్యూరీ మెంబర్ అండ్ చీఫ్ అడ్వైజర్ టీవీ ఆశోక్ పాల్గొని ప్రసంగాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా 24 గంటల పాటు నిరంతర ప్రసంగం చేయడం పట్ల తెలుగు బుక్ ఆఫ్ రికార్డులో నమోదుకు ఎక్కిందని నిర్వాహకులు తెలిపారు. తెలుగు బుక్ ఆఫ్ రికార్డులో నమోదు అయినందుకు ప్రియాంక ఆనందం వ్యక్తం చేశారు. ఇంకా గిన్నీస్ బుక్‌లో పేరు సంపాదించడమే లక్ష్యంగా కృషి చేస్తానని ధీమా వ్యక్తం చేశారు.
ఇవీ చదవండి: