Thefts in Govt Offices: ఏలూరు జిల్లా నూజివీడులో నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఈఈ అధికారి కార్యాలయంలో రికార్డులు మాయమయ్యాయి. 30 సంవత్సరాల నాటి రికార్డులు చోరీకి గురయ్యాయి. పది రోజుల క్రితం ఎంపీడీవో కార్యాలయంలో టీవీలు మాయమయ్యాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో వరుసగా దొంగతనాలు జరగటంతో అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
10 రోజుల్లో వరుస చోరీలు.. నూజివీడు ప్రభుత్వ కార్యాలయాల్లో ఏం జరుగుతోంది - ఏపీ తాజా
Thefts in Govt Offices: నూజివీడులోని ప్రభుత్వ కార్యాలయాల్లో వరుస దొంగతనాలు పోలీసులను కలవరపెడుతున్నాయి. కొన్ని రోజుల క్రితం ఖరీదైన వస్తువులు చోరీ కాగా.. తాజాగా రికార్డులు సైతం కనిపించకుండా పోవడం ఆందోళనకు గురి చేస్తున్నాయి.
నూజివీడు ప్రభుత్వ కార్యాలయాల్లో ఏం జరుగుతోంది !