ఏలూరు జిల్లా మండవల్లి మండలం కానుకొల్లులో పామర్రు కత్తిపూడి జాతీయ రహదారిపై భారీ వృక్షం నేలకొరిగింది. ఆ సమయంలో వాహనాలు కొన్ని దాటిపోగా.. మరికొన్ని సమీపంలో ఉన్నాయి. దీంతో.. తృటిలో ప్రమాదం తప్పినట్లైంది. రోడ్డుకు అడ్డంగా చెట్టు కూలడంతో ఇరువైపులా కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న పోలీసులు.. ఘటనాస్థలానికి చేరుకుని.. జేసీబీ సహాయంతో చెట్టును తొలగించారు.
కుప్పకూలిన భారీ వృక్షం.. కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు! - A huge tree lying on the road in eluru district
ఏలూరు జిల్లాలో రహదారిపై భారీ వృక్షం నేలకొరిగింది. రోడ్డుకు అడ్డంగా చెట్టు కూలడంతో ఇరువైపులా కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని.. జేసీబీ సహాయంతో చెట్టును తొలగించారు.

రహదారిపై నెలకొరిగిన భారీ వృక్షం
రహదారిపై నెలకొరిగిన భారీ వృక్షం.. కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు
నిత్యం రద్దీగా ఉండే రహదారిలో.. భారీ వృక్షం నెలకులడంతో వందలాది వాహనాలు నిలిచిపోయాయి. చెట్టు నేలకొరుగుతుండటాన్ని గుర్తించిన స్థానికులు.. అటు వైపుగా ప్రయాణిస్తున్న వాహనదారులను అప్రమత్తం చేయడంతో ప్రాణ, ఆస్తి నష్టం తప్పింది. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకుతోడు.. ఇటీవల జరిగిన రోడ్డు మరమ్మతుల కారణంగా భారీ వృక్షం మొదలు దెబ్బ తిని.. కూలినట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి:
TAGGED:
ఏలూరు జిల్లా వార్తలు