తూర్పుగోదావరి జిల్లా సీతానగరం శిరోముండనం వ్యవహారంలో బాధితులకు న్యాయం చేసేందుకు పోరాడతామని స్థానిక వైకాపా ఎస్సీ నాయకులు తెలిపారు. శిరోముండనం ఘటనను ప్రతీ ఒక్కరూ ఖండించాల్సిందేనని స్పష్టం చేశారు. బాధితుడు ప్రసాద్ చెప్పినట్లు అక్కడ ఎలాంటి ఇసుక లారీ ప్రమాదం జరగలేదని.. వేరే ప్రమాదం జరిగి గాయపడ్డాడని చెప్పారు. దీన్ని రాజకీయం చేయొద్దని... ఎస్సీల్లో చిచ్చు పెట్టొద్దని ఆయా వ్యక్తులు, పార్టీలకు విజ్ఞఫ్తి చేశారు.
'శిరోముండనం బాధితుడికి న్యాయం జరిగేలా చూస్తాం' - ysrcp cell response on sc young man tonsure incident
తూర్పుగోదావరి జిల్లా సీతానగరంలో ఎస్సీ యువకుడి శిరోముండనం ఘటనను స్థానిక వైకాపా ఎస్సీ నాయకులు ఖండించారు. బాధితులకు న్యాయం చేసేలా పోరాడతామని తెలిపారు. దీన్ని రాజకీయం చేయొద్దని విజ్ఞప్తి చేశారు.
'శిరోముండనం బాధితుడికి న్యాయం జరిగేలా చూస్తాం'