YSRCP KAPU LEADERS MEETING : కాపుల అభివృద్ధికి వైకాపా ప్రభుత్వం పెద్దపీట వేసిందని.. ఆ వర్గం మంత్రులు, ప్రజాప్రతినిధులు అన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా.. కాపు సంక్షేమానికి కృషి చేస్తోందన్నారు. పదవుల పరంగానూ తమ వర్గానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. ఇటీవల జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. రాజమహేంద్రవరంలో సమావేశమైన కాపు ప్రజాప్రతినిధులు.. తాజా రాజకీయ పరిస్థితులు సహా వివిధ అంశాలపై చర్చించారు. త్వరలోనే విజయవాడలో మరోసారి మరి కొంతమంది నాయకులను ఆహ్వానించి సమావేశం నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు.
"ఎన్నడూ లేనివిధంగా.. కాపు సంక్షేమానికి వైకాపా ప్రభుత్వం కృషి"
YSRCP KAPU LEADERS MEETING : గతంలో ఎన్నడూ లేని విధంగా.. కాపు సంక్షేమానికి వైకాపా ప్రభుత్వం కృషి చేస్తోందని ఆ వర్గం మంత్రులు, ప్రజాప్రతినిధులు అన్నారు. రాజమహేంద్రవరంలో సమావేశమైన కాపు ప్రజాప్రతినిధులు.. తాజా రాజకీయ పరిస్థితులు సహా వివిధ అంశాలపై చర్చించారు.
మంజీరా కన్వెన్షన్‌లో నిర్వహిస్తున్న సమావేశానికి.. మంత్రులు బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు, కొట్టు సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్, దాడిశెట్టి రాజా హాజరయ్యారు. మాజీ మంత్రులతోపాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. అలాగే చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ కలిస్తే వచ్చే ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం ఉంటుందనే అంశపైనా చర్చించినట్లు తెలుస్తోంది. గోదావరి జిల్లాల్లో కాపు ఓటర్లపై ఎలాంటి ప్రభావం ఉంటుందనే విషయంపై అధికార పక్ష నేతలు చర్చించినట్లు సమాచారం.
ఇవీ చదవండి: