ఏజెన్సీ ప్రాంతంలో మాత, శిశు మరణాలను నిర్ములించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ సంపూర్ణ పోషణ కార్యక్రమాన్ని ప్రవేశ పెట్టారని... శిశు, మహిళాభివృద్ది సంక్షేమ శాఖ జిల్లా ఇంచార్జ్ ఉప సంచాలకులు విజయలక్ష్మి చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం ఐటీడీఏలో ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఐటీడీఏ పరిధిలోని ఏడు మండలాల్లో 2093 మంది గర్భిణులకు, 2884 మంది బాలింతలకు, ఆరు నెలల వయసు నుంచి మూడు సంవత్సరాల వయస్సు ఉన్న పిల్లలలకు 600 రూపాయలు విలువ చేసే పోషకాహార కిట్లను అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రంపచోడవరం సీడీపీఓ క్రాంతి కుమారి, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.
రంపచోడవరంలో "వైఎస్సార్ సంపూర్ణ పోషణ" ప్రారంభం - వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకం వార్తలు
తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో వైఎస్సార్ సంపూర్ణ పోషణ కార్యక్రమం ప్రారంభమైంది. రంపచోడవరం ఐటీడీఏలో ఈ పథకం ద్వారా గర్భిణులు, బాలింతలు, పిల్లలలకు పోషకాహార కిట్లు అందించారు.
![రంపచోడవరంలో "వైఎస్సార్ సంపూర్ణ పోషణ" ప్రారంభం "YSR Complete Nutrition" Scheme launched](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5598521-998-5598521-1578196930747.jpg)
రంపచోడవరంలో "వైఎస్సార్ సంపూర్ణ పోషణ"