ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాజమహేంద్రవరంలో పెన్షన్‌ లబ్ధిదారులతో సీఎం ముఖాముఖి.. ముహూర్తం ఖరారు - ఏపీ రాజకీయ వార్తలు

Jagan Mohan Reddy will visit Rajahmundry: ఎల్లుండి సీఎం జగన్ తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో పర్యటించనున్నారు. వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక పెంపుదలపై లబ్ధిదారులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించి, బహిరంగ సభలో సీఎం ప్రసంగించనున్నారు.

YS Jagan Mohan Reddy
ముఖ్యమంత్రి వైఎస్ జగన్

By

Published : Jan 1, 2023, 7:58 PM IST

YS Jagan Mohan Reddy: ఈ నెల 3వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో పర్యటించనున్నారు. వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక పెంపుదల, లబ్ధిదారులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఎల్లుండి ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 11 గంటలకు రాజమహేంద్రవరం చేరుకోనున్నారు. 11.20 గంటలకు ఆర్ట్స్‌ కళాశాల ప్రాంగణంలో వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక పెంపుదల పై లబ్ధిదారులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించి, బహిరంగ సభలో సీఎం ప్రసంగించనున్నారు. కార్యక్రమం అనంతరం మధ్యాహ్నం 1.40 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 2.40 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. సీఎం రాకకోసం ఆ ప్రాంతాన్ని అధికారులు సిద్దం చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details