ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

యువకుల ఔదార్యం... 50 రోజులుగా అభాగ్యులకు ఆహారం - ఆహారం పంపిణీ చేసిన రావులపాలెం యువత

వారంతా యువకులు. లాక్​డౌన్​తో నిరాశ్రయులు, యాచకులు పడుతున్న ఇబ్బందులు చూసి చలించారు. వారికి సాయం చేయాలనే సంకల్పంతో, దాతల సహాయ సహకారాలతో 50 రోజుల నుంచి నేటి వరకు సుమారు 150 మందికి భోజనాలు అందించారు.

youth distribute food at raavulapalem in east godavari district
పేదలకు ఆహారం పంపిణీ చేస్తున్న రావులపాలెం యువత

By

Published : May 13, 2020, 4:03 PM IST

తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం మారుతినగర్​కు చెందిన కొంతమంది యువకులు.. యాచకుల్ని, నిరాశ్రయుల్ని ఆదుకుంటున్నారు. రోజూ ఉదయం, సాయంత్రం దాదాపు 150 మందికి ఆహారం అందజేశారు. లాక్ డౌన్ కారణంగా వారు పడుతున్న ఇబ్బందుల్ని చూసి స్పందించి.. వారికి చేయూతగా నిలిచారు.

దాతల సహకారంతో 50 రోజులుగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా కొనసాగిస్తూ.. నేటితో ముగిస్తున్నట్లు తెలిపారు. ఇన్ని రోజులు అభాగ్యులకు అన్నంపెట్టిన యువకులను పలువురు ప్రశంసించారు.

ఇవీ చదవండి... కోనసీమలో 28 రోజుల పాటు కఠినంగా లాక్ డౌన్

ABOUT THE AUTHOR

...view details