ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ntr: అభిమాని కోరిక తీర్చిన యంగ్ టైగర్ - Young Tiger ntr fulfilled a fan wish

ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో కొట్టిమిట్టాడుతున్న తన అభిమాని కోరిక తీర్చాడు సినీనటుడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. మలికిపురం మండలం గూడపల్లికి చెందిన కొప్పాడి మురళి(27)కి ఇటీవల జరిగిన ఓ ప్రమాదంలో రెండు మూత్ర పిండాలు దెబ్బతిన్నాయి. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మురళి.. తాను అభిమానించే నటుడు ఎన్టీఆర్‌ను చూడాలని కోరాడు. విషయం తెలుసుకున్న యంగ్ టైగర్ బుధవారం వీడియో కాల్‌లో కొప్పాడి మురళిని పలకరించారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించాడు.

ntr
ntr

By

Published : Oct 7, 2021, 11:08 AM IST

Updated : Oct 7, 2021, 11:32 AM IST

తూర్పు గోదావరి జిల్లా మలికిపురం మండలం గూడపల్లికి చెందిన కొప్పాడి మురళి ... జూనియర్ ఎన్టీఆర్ వీరాభిమాని. కొప్పాడి మురళి ఇటీవల జరిగిన ఓ ప్రమాదంలో రెండు మూత్ర పిండాలు దెబ్బతిని విజయవాడలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు . ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న మురళి తన చివరి కోరికగా... అతను ఎంతో అభిమానించే యంగ్ టైగర్ ఎన్టీఆర్​ను కలవాలని వైద్యులకు చీటీ రాసి చూపించాడు. వైద్యులు తన తల్లిదండ్రులకు బంధువులకు విషయాన్ని తెలియజేశారు.

వారు తూర్పుగోదావరి జిల్లా ఎన్టీఆర్ అభిమాన సంఘ అధ్యక్షుడులు రాయుడు బాబ్జి, భాస్కర్ చౌదరికి తెలియచేశారు. వారి ద్వారా విషయం తెలుసుకున్న ఎన్టీఆర్ బుధవారం వీడియో కాల్‌లో మురళిని పలకరించి పరామర్శించారు. ఎన్టీఆర్​ను చూసిన మురళి సంపూర్ణ ఆరోగ్యంతో మూడు నెలల్లో బయటకు వస్తానని తన సైగలతో ఎన్టీఆర్​కి వివరించాడు. తన అభిమాని త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో బయటికి రావాలని ఎన్టీఆర్.. మురళికి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా మురళి కుటుంబ సభ్యులు బంధుమిత్రులు ఎన్టీఆర్​కు ధన్యవాదాలు తెలిపారు.

ఇదీ చదవండి

TDP: దగ్ధమైన బోటులో మత్తు పదార్థాలున్నాయి: వర్ల రామయ్య

Last Updated : Oct 7, 2021, 11:32 AM IST

ABOUT THE AUTHOR

...view details