ప్రేమించిన యువతితో పెళ్లి చేయాలని, లేకుంటే వాటర్ ట్యాంక్పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటానంటూ తూర్పుగోదావరి జిల్లా రావులపాలేనికి చెందిన ఓ యువకుడు హల్చల్ చేశాడు. రావులపాలెం కొత్తకాలనీకి చెందిన శివ కొంత కాలంగా అదే కాలనీకి చెందిన యువతిని ప్రేమిస్తున్నాడు. యువతి తల్లిదండ్రులు పెళ్లికి నిరాకరించటంతో శివ ఆత్మహత్య చేసుకుంటానని వాటర్ ట్యాంక్ ఎక్కాడు.
ప్రేమించిన యువతితో పెళ్లి చేయాలని.. వాటర్ ట్యాంక్ ఎక్కిన యువకుడు - తూర్పుగోదావరి జిల్లాలో ప్రేమించిన యువతితో పెళ్లి చేయాలని వాటర్ ట్యాంక్ ఎక్కిన యువకుడు
తూర్పుగోదావరి జిల్లా రావులపాలేనికి చెందిన ఓ యువకుడు వాటర్ ట్యాంక్ ఎక్కి హల్చల్ చేశాడు. తాను ప్రేమించిన యువతితో పెళ్లి చేయాలని, లేకుంటే ట్యాంక్పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు.

ప్రేమించిన యువతితో పెళ్లి చేయాలని వాటర్ ట్యాంక్ ఎక్కిన యువకుడు
ప్రేమించిన యువతితో పెళ్లి చేయాలని వాటర్ ట్యాంక్ ఎక్కిన యువకుడు
సమాచారం తెలుసుకున్న పోలీసులు..అక్కడికి చేరుకొని యువకుడిని కిందికు దించే ప్రయత్నం చేశారు. అయినా ఫలితం లేకుండా పోయింది. ప్రేమించిన అమ్మాయితోనే పెళ్లి చేయిస్తామని గ్రామపెద్దలతో చెప్పించటంతో యువకుడు కిందకు దిగాడు. దింతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ఇదీచదవండి:వీర జవాన్ కుటుంబ భూమి కబ్జా... విశ్రాంత సైనికుల పోరాటం