ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పరువు తీసిన టిక్​టాక్ వీడియో.. యువకుడి ఆత్మహత్య! - రాజోలులో ప్రాణం తీసిన టిక్​టాక్ వీడియో న్యూస్

ఏదైనా వీడియో వైరల్ కావాలంటే.. ఇప్పుడు టిక్​టాక్​.. పెద్ద వేదిక. ఆ దారినే నమ్మిన ఓ వ్యక్తి.. తన స్నేహితుడిపై వీడియో చేసి వైరల్ చేశాడు. చివరకు అదే ఆ మిత్రుని ప్రాణం తీసింది.

young man sucide in kuwait because off tiktok video

By

Published : Nov 10, 2019, 9:17 PM IST

Updated : Nov 11, 2019, 10:03 AM IST

పరువు తీసి.. ప్రాణం తీసిన టిక్​టాక్​ వీడియో!

టిక్​టాక్ వీడియోలతో.. కొంత మంది ఫేమస్ అయిపోతుంటే.. మరి కొంతమంది బలైపోతున్నారు. తాజాగా తన స్నేహితుడే.. వీడియో చేసి పరువు తీశాడని ఓ వ్యక్తి మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు.

తూర్పుగోదావరి జిల్లా రాజోలు మండలం శివకోటికి చెందిన పుచ్చకాయల మోహన కుమార్(30) ఉపాధి నిమిత్తం కువైట్ వెళ్లాడు. అక్కడ పని చేసుకుంటూ ఇంటికి డబ్బులు పంపించేవాడు. 2వేల దినార్లు అంటే నాలుగున్నర లక్షల రూపాయల చీటి పాడుకుని కనిపించకుండా పరారీలో ఉన్నాడని కుమార్​పై తన స్నేహితుడు.. ఓ టిక్ టాక్ వీడియో క్రియేట్ చేశాడు. తనపై ఆరోపణలు చేస్తూ.. వీడియో చేయటంతో పరువు పోయిందని మోహన కుమార్​ మనస్తాపం చెందాడు. కువైట్​లోనే ఈ నెల మూడో తేదీన ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

కువైట్​ ఎంబసీ అధికారులతో భారత ఎంబసీ అధికారులు మాట్లాడి మృతదేహాన్ని తీసుకువచ్చారు. ఉపాధి కోసం వెళ్లిన తన కుమారుడు విగతజీవిగా తిరిగి రావటం కుటుంబాన్ని కలచివేసింది. వారంతా కన్నీరు మున్నీరుగా విలపించారు.

ఇదీ చదవండి:

ఇసుక కొరతతో మరో భవన నిర్మాణ కార్మికుడు ఆత్మహత్య

Last Updated : Nov 11, 2019, 10:03 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details