ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పంట కాల్వలోకి దూసుకెళ్లిన కారు... యువకుడు మృతి - sakhinetipalli mandal news

శుభకార్యానికి హాజరై తిరిగి ఇంటికి బయలుదేరిన యువకుడు విగతజీవిగా మారాడు. రోడ్డు ప్రమాదంలో ప్రాణం కోల్పోయాడు. మరో యువకుడు గాయపడ్డాడు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలంలో జరిగింది.

car accident
car accident

By

Published : Dec 28, 2020, 12:56 PM IST

పంట కాల్వలోకి దూసుకెళ్లిన కారు... యువకుడు మృతి

తూర్పు గోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం టేకిశెట్టి పాలెం వద్ద సోమవారం తెల్లవారుజామున పంట కాల్వలోకి కారు దూసుకెళ్లిన ఘటనలో ఓ యువకుడు మృతి చెందాడు. మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. మలికిపురం మండలం గుడిమెల్లంకకు చెందిన వీరు..పెద్దలంకలో వివాహ కార్యక్రమానికి హాజరయ్యారు. తిరిగి స్వగ్రామం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

మృతుడిని హరీష్(24)గా గుర్తించారు. మరో యువకుడు కిరణ్ కారులో నుంచి ఒడ్డుకు చేరుకొని ప్రాణాలు రక్షించుకున్నాడు. కుక్కను తప్పించే క్రమంలో అతివేగంతో వెళ్తున్న కారు అదుపు తప్పి కాల్వలోకి దూసుకెళ్లినట్టు స్థానికులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details