తెలంగాణలోని భద్రాచలం పట్టణం, ముదిరాజ్ బజార్ కు చెందిన 18 సంవత్సరాల చుక్క లక్ష్మణ్ ఎలక్ట్రీషియన్. తూర్పుగోదావరి జిల్లా ఎటపాక మండలం సీతాపురం గ్రామంలో ఓ ఇంట్లో సీసీ కెమెరాలు అమర్చేందుకు స్నేహితుడు మూర్తితో కలిసి వెళ్లాడు. అవసరమైన అన్ని చోట్ల కెమెరాలను అమర్చాడు. పని ముగిసిన అనంతరం వాటిని మరోసారి పరీక్షించేందుకు వైర్లను పట్టుకోగా విద్యుదాఘాతానికి గురయ్యాడు. గమనించిన వారు అప్రమత్తమై విద్యుత్ సరఫరా ఆపివేశారు. అపస్మారక స్థితికి చేరిన లక్ష్మణ్ ను ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతను మృతిచెందినట్లు వైద్యులు నిర్ధరించారు. కుటుంబ పోషణ కోసం పనికెళ్లిన కుమారుడు మృత్యు ఒడికి చేరాడంటూ అతని కుటుంబీకులు కన్నీరు మున్నీరయ్యారు.
సీసీ కెమెరాలు అమరుస్తుండగా.. యువకుడి మృత్యువాత - etapaka
తూర్పు గోదావరి జిల్లా ఎటపాక మండలం సీతాపురం గ్రామంలో సీసీ కెమెరాలు అమరుస్తుండగా విద్యుతాఘాతంతో చుక్కా లక్ష్మణ్ అనే యువకుడు మరణించాడు.
సీసీ కెమెరాలు అమరుస్తుండగా యువకుడి మృత్యువాత