తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురానికి చెందిన కొల్లి కిరణ్... స్నానం చేసేందుకు కట్టుంగ కాలువ రేవు వద్దకు వెళ్లాడు. స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు జారి కాలువలో పడిపోయాడు.
నీటి ప్రవాహానికి కొట్టుకుపోయి, గల్లంతయ్యాడు. గమనించిన స్థానికులు గాలింపు చర్యలు చేపట్టగా... కొద్ది దూరంలో శవమై కనిపించాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.