తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలం జొన్నాడ గ్రామంలో యువతి అనుమానాస్పద మృతిపై పోలీసులు కేసు నమోదు చేశారు. గ్రామానికి చెందిన 21 ఏళ్ల యువతి అదే గ్రామానికి చెందిన నరేంద్ర వంశీ అనే యువకుడు సంవత్సర కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఇరువురు పెద్దలు వీరి ప్రేమను అంగీకరించడంతో పాటు పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు.
యువతి అనుమానాస్పద మృతి... కేసు నమోదు ! - యువతి అనుమానస్పద మృతి...పోలీసులు కేసు నమోదు !
యువతి అనుమానాస్పద మృతిపై పోలీసులు కేసు నమోదు చేసిన ఘటన తూర్పుగోదావరి జిల్లా జొన్నాడ గ్రామంలో చోటుచేసుకుంది. ఖననం చేసిన యువతి మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిర్వహించారు. మృతికి గల కారణాలపై ఆరా తీస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
కాగా గత నెల 30న యువతి ఆత్మహత్య చేసుకుంది. యువతి మృతదేహాన్ని అదే రోజు కుటుంబ సభ్యులు, పెద్దలు ఖననం చేశారు. యువతి మృతి చెందిన విషయం తెలిసి నరేంద్ర వంశీ పురుగుల మందు తాగి రాజమహేంద్రవరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. తన కుమార్తె మృతికి నరేంద్ర వంశీ కారణమని సోమవారం యువతి తల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సుభాకర్ తెలిపారు. ఖననం చేసిన యువతి మృతదేహాన్ని వెలికితీసి వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు.
ఇది చదవండి: చేతబడి పేరుతో గిరిజనుడి దారుణ హత్య