తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం కొత్తపేట వీధిలో విషాదం జరిగింది. యువ జంట పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతులు స్థానికుడైన తూరంగి జగదీష్, రాజమహేంద్రవరానికి చెందిన దీప్తిగా గుర్తించారు. గత ఎనిమిది నెలలుగా ఆ ఇంట్లో అద్దెకి ఉన్నట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తు అనంతరం వివరాలు వెల్లడిస్తామని సీఐ తెలిపారు. మృతదేహాలను రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
పురుగుల మందు తాగి.. యువజంట ఆత్మహత్య - బలవన్మరణం
ధవళేశ్వరం కొత్తపేటలో ఓ యువజంట పురుగుల మందు తాగి తనువు చాలించారు. ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
పురుగుల మందు తాగి యువజంట ఆత్మహత్య