తూర్పుగోదావరి జిల్లా అమలాపురం పార్లమెంటు నియోజకవర్గాన్ని రాష్ట్రానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని నూతనంగా ఎన్నికైన ఎంపీ చింత అనురాధ అన్నారు. సీఎం జగన్ ప్రకటించిన నవరత్నాలపై నమ్మకంతోనే ప్రజలు వైకాపాను ఆదరించారని పి.గన్నవరం శాసనసభ్యుడు కొండేటి చిట్టిబాబు పేర్కొన్నారు. ఎన్నికల్లో తమను గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. జిల్లాలోని జి.పెదపూడి నుంచి ముక్తేశ్వరం వరకు వైకాపా శ్రేణులు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో అమలాపురం ఎంపీ, పి. గన్నవరం ఎమ్మెల్యే చిట్టిబాబు పాల్గొన్నారు.
'ఇంతటి ప్రజాదరణకు వైకాపా నవరత్నాలే కారణం' - అమలాపురం ఎంపీ
తూర్పుగోదావరి జిల్లా జి.పెదపూడి నుంచి ముక్తేశ్వరం వరకు వైకాపా శ్రేణులు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో స్థానిక నియోజకవర్గం ఎంపీ, ఎమ్మెల్యే పాల్గొన్నారు. సీఎం జగన్...ప్రమాణ స్వీకరణ రోజున చెప్పిన ప్రతి హామీ నేరవేరుస్తారని ఎంపీ అనురాధ చెప్పారు. తమను అఖండ మెజారిటీతో గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.
వైకాపా నవరత్నాలే...ఇంతటి ప్రజాదరణకు కారణం : అమలాపురం ఎంపీ
ఇవీ చూడండి :స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు కసరత్తు