తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట మండలం తంగెయ్యమ్మపురంలో కిడ్నాప్ వదంతులు.. కలకలం సృష్టించాయి. తెదేపా ఎంపీటీసీ అభ్యర్థి సంధ్యను తప్పుకోవాలని ఒత్తిళ్లు రావడం.. ఆమెను ఎవరో అపహరించబోతున్నారని వదంతులు పుట్టుకు వచ్చాయి. సమాచారం తెలిసిన వెంటనే ఎస్సీ, సీఐ సంధ్య ఇంటికి వెళ్లారు. ఆమె ఇంటికి తాళం వేసుకుని.. లోపలే పోలీసుల సమక్షంలో ఉన్నారు. ఇవాళ ఉదయం నుంచి ఆమె భర్త కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో తెదేపా కార్యకర్తలు అక్కడికి పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ఓటమి భయంతోనే నియోజకవర్గంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్ధులను వైకాపా భయభ్రాంతులకు గురిచేస్తోందని తెదేపా నాయకుడు, జిల్లా పరిషత్ మాజీ ఛైర్మన్ జ్యోతుల నవీన్‌కుమార్ ఆరోపించారు.
'నామినేషన్ ఉపసంహరించుకోవాలని మమ్మల్ని బెదిరిస్తున్నారు'
నామినేషన్లు ఉపసంహరించుకోవాలంటూ వైకాపా నాయకులు భయపెడుతున్నారని తూర్పు గోదావరి జిల్లా తెలుగుదేశం నాయకులు ఆరోపించారు. జగ్గంపేట మండలంలో వైకాపా నేతలు రౌడీ రాజకీయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెదేపా ఎంపీటీసీ అభ్యర్థి సంధ్య కుటుంబాన్ని బెదిరిస్తున్నారని ధ్వజమెత్తారు.
ycp leaders threaten Tdp candidates to withdraw nominations